కోతులు చేసిన పనికి.. నిండు ప్రాణం బలి?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది మనుషులు అడవులను నరికివేసి భవనాలను నిర్మించుకుంటున్న నేపథ్యంలో అడవుల్లో ఉండే జంతువులు అన్నీ కూడా జనావాసాల్లోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. జంతువులు జనావాసాల్లోకి వస్తున్న నేపథ్యంలో మనిషి మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే చెప్పాలి. అయితే ఇలా జనావాసాల్లో ఎక్కువగా కనిపించే జంతువులు కోతులు. గుంపులుగా వచ్చి ఊర్లో తిరుగుతూ ఎంతోమందిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. అంతే కాదు ఎంతో మంది పై దాడిచేసి గాయపరిచడం లాంటివి కూడా చూస్తూనే ఉంటాయ్.

 ఇలా ఇప్పుడు వరకు కోతల మూక చేసిన విధ్వంసం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కోతుల మూక చేసిన పనికి చివరికి ఒక నిండు ప్రాణం బలైంది. హనుమకొండ జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో కమలాకర్ రెడ్డి నివాసం పైకి ఇటీవలే కోతుల గుంపు చేరి విధ్వంసం సృష్టించాయి. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడేసాయి. ఇక ఇలాంటి సమయంలోనే ఇంటికి సంబంధించిన విద్యుత్ తీగలు కూడా చెదిరిపోయాయి అని చెప్పాలి.

 కాగా ఇది గమనించలేదు కమలాకర్ రెడ్డి భార్య రజిత. ఇంటి వెనుక ఉన్న తీగలపై బట్టలు ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన భర్త వెంటనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ కొట్టింది. కుటుంబ సభ్యులు వెంటనే కమలాకర్రెడ్డి నీ కర్రతో భార్య నుంచి విడదీశారు. కానీ రజిత మాత్రం అప్పటికే చివరికి మృతిచెందింది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులను మరింత భయాందోళనకు గురవుతున్నారు. కోతుల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: