పడుకునే స్థలం విషయంలో గొడవ.. తిరుమలలో దారుణ హత్య?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలో చూసిన తర్వాత ప్రతి క్షణం భయం భయం అనే విధంగానే మారిపోయింది మనిషి జీవితం. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ప్రాణం పోతుందో కూడా తెలియని విధంగా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో రకాల ప్రాణాంతకమైన వైరస్లు మనుషుల ప్రాణాలు తీసేందుకు దూసుకు వస్తున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు క్షణక్షణం భయపడుతున్నాడు మనిషి. ఇలాంటి సమయంలోనే మానవత్వం మర్చిపోయి  ఉన్మాదులు గా మారిపోతున్న సాటి మనుషులతో కూడా మనిషి ప్రాణాలకు రిస్కు రోజురోజుకూ ఎక్కువ అవుతుంది అన్నది తెలుస్తుంది.

 దీంతో  ఎప్పుడు ఎటు వైపు నుంచి ప్రాణహాని దూసుకు వస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు  సాటి మనుషుల విషయంలో జాలి దయ లేకుండా దారుణంగా హత్యలకు  పాల్పడుతూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఏకంగా సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చిన్నపాటి గొడవ ఏకంగా ఒక హత్యకు దారి తీసిన ఉదంతం ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తోంది. తిరుమలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని అరని జిల్లాకు చెందిన శరవణన్ అదే రాష్ట్రానికి చెందిన భాస్కర్ ఇద్దరు తిరుమలలో  పనులు చేసుకుంటూ రాత్రుళ్లు అక్కడే పడుకునేవారు.

 అయితే ఇటీవలే రాత్రి సమయంలో స్థానికంగా ఉన్న ఒక మ్యూజియానికి ఎదురుగా వయోవృద్ధుల టికెట్ల పంపిణీ కేంద్రం దగ్గర భాస్కర్ పడుకున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన శరవణన్ అది తన చోటని ఇక్కడ ఎందుకు పడుకున్నావు అంటూ గొడవకు దిగాడు. భాస్కర్ ని అక్కడి నుంచి పంపించి వేశాడు. అయితే కోపంతో ఊగిపోయిన భాస్కర్ కొద్దిసేపటికే ఒక బండరాయిని తీసుకువచ్చి నిద్రపోతున్న శరవణన్ తలపై మోదీ హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక భాస్కర్ ను పట్టుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: