పరీక్షకు భయపడి.. బాంబు ఉందని మెసేజ్.. చివరికి?

praveen
పరీక్షలు  వచ్చాయంటే చాలు విద్యార్థులు ఎంతలా బెంబేలెత్తి పోతుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పరీక్షలు ఏంటి రా దేవుడా చదువ లేక చచ్చిపోతున్నాం అంటూ లోలోపల ఎంతగానో బాధపడిపోతుంటారు విద్యార్థులు. పరీక్షల ముందు వరకు కూడా గాలి తిరుగుళ్ళు తిరిగిన వారు సైతం ఇక పుస్తకాల పురుగుల్లా మారిపోయి కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సబ్జెక్టు మొత్తం నేర్చుకోవాలి అని తెగ చదివేస్తూ ఉండటం లాంటివి కూడా చూస్తూ ఉంటారూ. ఇలా ఎంతో మంది కష్టపడి చదివి ఇక పరీక్షల్లో పాస్ కావడానికి ప్రయత్నిస్తే మరికొంతమంది కాస్త అతి తెలివిని ప్రదర్శిస్తూ పరీక్షల్లో కాపీ కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

 ఇలా పరీక్షల్లో కాపీ కొడుతూ చివరికి దొరికిపోయి డీబార్ అవ్వటం లాంటివి కూడా ఎంతో మంది విద్యార్థుల విషయంలో జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. మరికొంత మంది విద్యార్థులు.. అబ్బా ఈ సబ్జెక్ట్ ఇంకాస్త చదివి ఉంటే బాగుండేది.. ఇప్పుడెలా పరీక్ష పోస్ట్పోన్ అయితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ విద్యార్థులు అలాగే కోరుకున్నారు. కానీ అక్కడితో ఆగలేదు ఏకంగా పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యేలా పక్కా ప్లాన్ వేశారు. సినిమాల్లో చూపించినట్లు గానే  ప్లాన్ అమలు చేశారు ఇక్కడ విద్యార్థులు. ఏకంగా పరీక్షా కేంద్రంలో బాంబు ఉంది అంటూ బెదిరింపు కాల్స్ చేశారు.

 ఇంకేముంది ఇక పరీక్షా కేంద్రంలో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లు అందరూ కూడా అక్కడి నుంచి పరుగో పరుగు అన్నారు. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. పరీక్షలను పోస్ట్పోన్ చేయించేందుకు విద్యార్థులు  స్కూల్లో బాంబు ఉందని  ఫేక్ మెయిల్ పంపాడు. కర్ణాటక కాంగ్రెస్ చీప్ డీకే శివకుమార్ కు చెందిన నేషనల్ హిల్ వ్యూ స్కూల్లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ మెయిల్ పంపగా ఇక సోమవారం ఈ మెయిల్ చూసుకొని సెలవు ప్రకటించారు. బాలుడు చేసిన పని కాస్తా బెంగళూరు వ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: