ప్రాణం మీదికి తెచ్చిన కొబ్బరికాయ.. ఏం జరిగిందంటే?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో రకాల విచిత్రమైన ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియా లోకి వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక మరి కొన్ని ఘటనలు ఓరినాయనో మనుషులు ఇలా కూడా ఉంటారా అని ప్రతి ఒక్కరూ మనసులో అనుకునేలా చేస్తూ ఉంటాయి. ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఏ రేంజిలో కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి వర్షం కాస్త తగ్గినప్పటికీ అటు ఏపీలో మాత్రం వర్షం తీవ్రత అలాగే ఉంది. అదే సమయంలో వరద తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది అనే చెప్పాలి.

 భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ప్రస్తుతం జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయాయ్. దీంతో ఇక జనావాసం స్తంభించి పోయింది అని చెప్పాలి. వరదల కారణంగా ఎక్కడ ప్రాణాలు పోతాయి అని భయపడుతూ ప్రతి ఒక్కరు భయం భయంగానే బ్రతుకుతున్నారు. ఎక్కడైనా భారీగా వరద ప్రవాహం కనిపించింది అంటే చాలు అటువైపుగా వెళ్లడానికి కూడా జంకుతున్నారు అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా కొబ్బరికాయ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టడం మాత్రం సంచలనంగా మారిపోయింది. చివరికి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడూ సదరు వ్యక్తి.

 కోనసీమ జిల్లా పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వద్ద వెంకటేశ్వరరావు అనే యువకుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. గోదావరి వరదకు అక్విడెక్ట్  ముంపు బారిన పడింది. అయితే ఇటీవలే వరద ప్రభావం తగ్గింది. ఇక వరదకు కొట్టుకొచ్చిన కొబ్బరికాయలను  అక్విడెక్ట్ టాపాత్  మీదనుంచి వంగి తీసేందుకు వెంకటేశ్వరరావు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు ఇక నీటిలో పడి పోయాడు. అయితే అదృష్టవశాత్తూ ఈత రావడంతో అవతలి వైపు ఉన్న ఒక ఊచను పట్టుకుని కేకలు వేయడంతో స్థానికులు గమనించి అతన్ని బయటకు తీశారు. కాగా ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: