పుష్ప స్తైల్లో స్మగ్లింగ్..సీన్ రివర్స్..

Satvika
డబ్బు మనుషులను ఎలా మారుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందుకే ఎంతటి దారుణాలను అయిన దిగుతున్నారు.దాంతో నేరాల రేటు కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది..డబ్బులు ఈజిగా వస్తాయి అనుకుంటే మాత్రం సంఘ వ్యతిరేక చర్యలకు కూడా పాల్పడుతున్నారు. స్మగ్లింగ్, డ్రగ్స్,అక్రమ రవాణాలు చేయడానికి కూడా జనాలు సిద్ద పడుతున్నారు..సినిమాలను చూసి జనాలు నెరాల నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఒక సంఘటన వెలుగు చూసింది.


అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నారు.లాభాలు రాకపోగా అప్పులు పేరుకున్నాయి. దీంతో.. ఏదో ఒకటి చేసి ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలని భావించారు..పుష్ప సినిమా లెవెల్ లో ఎర్ర చందనం ను స్మగ్లింగ్ చేస్తున్నారు.వివరాల్లొకి వెళితే..కడప జిల్లాకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీ అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఏపీ నుంచి యూపీ, రాజస్థాన్‌, డిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు అరటి పండ్లు సరఫరా చేస్తుంటాడు..బషీర్‌కు మహ్మద్‌ రఫీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది..అరటి పండ్ల వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో ఇద్దరికీ అప్పులు పెరిగిపోయాయి. రఫీకి ఎర్రచందనం సరఫరా చేసే వ్యక్తులతో పరిచయాలు ఉండడంతో.. స్మగ్లింగ్‌ చేసి డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన మూర్తి అనే వ్యక్తిని కలిసి.. అతడికి రూ.లక్ష చెల్లించి 30 ఎర్రచందనం దుంగలు కొనుగోలు చేశారు..


పైన అరటి పండ్లు, కింద ఎర్ర చందనం దుంగలను పెట్టి సరఫరా చేస్తున్నారు.మల్కాజిగిరి ప్రాంతంలోని మౌలాలికి సమీపంలోని ప్రభుత్వ భూమిలో వీటిని దాచిపెట్టారు. వాటిని విక్రయించేందుకు యత్నిస్తుండగా.. పోలీసులకు సమాచారం అందింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు.. మల్కాజిగిరి పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి.. 150 కేజీల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం దుంగలను అమ్మిన మూర్తి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాకచక్యంగా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు..వారి నుంచి పూర్తీ వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: