జీలకర్రబెల్లం పెడుతుంటే కుప్పకూలిన వధువు.. చివరికి?
ఈ క్రమంలోనే కూతురు దూరమైపోతుంది అన్న బాధ ఒకవైపు.. కూతురు పెళ్లి జరుగుతుంది అన్న సంతోషం మరోవైపు ఆ తండ్రి మనసులో ఉంది. కానీ ఇంతలో ఊహించని విషాదకర ఘటన ఆ తండ్రి గుండె పగిలిపోయింది. సరిగ్గా పెళ్లి వేడుకలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడూ అని చెప్పాలి.
విశాఖపట్నంలోని మధురవాడ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శివాజీ సృజనల వివాహం ఇటీవలే జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరినీ పిలిచి సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం వివాహం జరుగుతున్న సమయంలో జీలకర్రబెల్లం పెడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే సృజన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.