పెళ్ళై మూడేళ్లు.. డాక్టర్ ఆ విషయం చెప్పటంతో.. సూసైడ్?

praveen
బలవన్మరణం.. ప్రస్తుతం ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి సొల్యూషన్ గా ఇదొక్కటే మార్గం గా కనిపిస్తోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించే వారు తక్కువ అయి పోయారు. బలవన్మరణానికి పాల్పడిన తర్వాత  బాధలు అన్నీ తీరిపోతాయి అని ఆలోచించేవారు ఎక్కువై పోయారు. ఈ క్రమం లోనే నేటి రోజుల్లో చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నా వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది.  జీవితం లో వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవటం మానేసి చివరికి పిరికి వాడిలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

 ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లోని నోయిడా లో ఘటన జరిగింది. అరూప్ సింగ్, శశికళ దంపతులు ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అన్యోన్యం గా కలిసి ఉంటూ సంతోషం గా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతలో వీధి వారికి ఊహించని చాలెంజ్ చేసింది. సంతోషం గా జీవితాన్ని గడుపుతున్న వారి లైఫ్ లో క్యాన్సర్ మహమ్మారి అనే చీకటి నింపేసింది. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అరూప్ పరీక్షలు చేయించుకున్నాడు.

 దీంతో వైద్యులు షాకింగ్ విషయాలు చెప్పారు. అతనికి క్యాన్సర్ సోకిందని ఇప్పటికే అడ్వాన్స్ పేజీలో ఉంది అంటూ చెప్పారు. దీంతో భార్య భర్తలు ఊహించుకున్న భవిష్యత్తు మొత్తం అంధకారం లో నిండి పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి ఇద్దరూ కొన్నాళ్లపాటు డిప్రెషన్లోకి వెళ్లి పోయారు. ఇక ఒకరిని విడిచి మరొకరు ఉండగలమా అనే ఆలోచనే వారి మనసును తొలిచేస్తుంది. చివరికి గదిలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. డోర్ పగలగొట్టి చూడగా దంపతులు ఉరివేసుకుని కనిపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: