సైబర్ నేరగాళ్ల మాస్టర్ ప్లాన్..కలెక్టర్ పేరుతో ట్రాప్..

Satvika
సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ ఎలా ఎవరిని టార్గెట్ చేస్తారో   ఊహించడం చాలా కష్టం.. అసలు మనకు తెలియకుండానే జరిగి పోతుంది..అయితే మొన్నటి వరకూ సాదారణ ప్రజలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.ఇప్పుడు ఏకంగా కలెక్టర్ పేరుతో జనాలకు, ప్రభుత్వ అధికారులు టోకరా పెట్టారు. గిఫ్ట్ గా డబ్బులు పంపించాలని కోరుతూ కొన్ని రిక్వెస్ట్ లు పంపారు..వాటిని నిజమే అని నమ్మి కొందరు డబ్బులు పంపి మరి మోసపోయారు.ఇలాంటి ఘటనలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.ఇప్పుడు వెలుగు చూసిన ఘటన మాత్రం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.


వివరాల్లొకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జిల్లా కలెక్టర్ పేరుతో ఒక సైబర్ దుండగుడు అధికారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒకరోజు బరేలీ జిల్లాలో అన్ని డిప్యూటీ కలెక్టర్లకు ఫోన్లకు జిల్లా కలెక్టర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో "ఎవరూ నాకు ఫోన్ చేయవద్దు. ప్రస్తుతం మీటింగ్‌లో ఉన్నాను. నేను ఒక వ్యక్తికి బహుమతి పంపాలి.ఒక్కొక్కరూ 10 వేల చొప్పున బహుమతి పేరుతో అమెజాన్ గిఫ్ట్ ఒచర్ లను పంపాలని విన్నపం పెట్టారు.


చివరకు అది ఓ సైబర్ నేరగాడి పని అని తేలడంతో పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.ఆ దుండగుడు జిల్లాలోని అన్ని సిటీల మేజిస్ట్రేట్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ల నుండి ఇ-గిఫ్ట్ వోచర్స్‌ను డిమాండ్ చేశాడు. అనుమానంతో డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్.. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని సంప్రదించగా అసలు విషయం బయటపడింది.తన పేరుతో ఎవరో సైబర్ నేరగాడు వల వేస్తున్నాడని కలెక్టర్ శివకాంత్ తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నేరగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి మెసేజ్ లు వస్తే అసలు నమ్మకండి అంటూ కలెక్టర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.జాగ్రత్త సుమీ..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: