అర్ధరాత్రి అడ్డుపడిన యువకుడు.. యువతి ఏం చేసిందంటే?

praveen
ఆడది అబల కాదు సబల అని చెబుతూ ఉంటారు. ఇక ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు ఆది పరాశక్తిగా మారి పోతుంది అని అంటూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలకే భయపడిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా బయట ఆకతాయిల ఎవరైనా వేధింపులకు గురి చేశారు అంటే భయంతో అక్కడినుంచి వెళ్లిపోతున్నారు తప్ప ఎక్కడ ఎదురు తిరగడం లేదు ఆడ పిల్లలు. కాగా నేటి రోజుల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆడపిల్లలు ధైర్యంగా ఎదురు తిరిగి పోరాడాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం పోలీసులు మహిళా సంఘాలు కూడా చెబుతున్నాయి.

 అయినప్పటికీ ఆకతాయిల వేధింపులు నేపథ్యంలో ఆడపిల్లలు భయపడుతూ ఉంటే.. కొంతమంది మహిళలు మాత్రం తమను వేధించిన వారి తాట తీస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ వున్నాయి. కోపం వస్తే ఆడది అబల కాదు సబల అని ఇలాంటి ఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. తనను వేధించిన ఆకతాయికి ఓ యువతి గట్టిగా బుద్ధి చెప్పింది. ఏకంగా నడిరోడ్డుమీద యువకుడిని చితకబాదింది యువతి.

 ఈ ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం లో పనిచేస్తున్న యువతి రాత్రి పూట విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలోనే బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ పోకిరి సదరు యువతిని అడ్డగించాడు. అసభ్యంగా  మాట్లాడుతూ వేధింపులకు గురి చేశాడు. అయితే రాత్రి సమయం కావడంతో అందరిలా ఆ యువతి భయపడలేదు. అక్కడి నుంచి వెళ్లిపోలేదు. ఏకంగా కాళిక అవతారమెత్తి కర్రతో సదరు యువకుడిని చితకబాదింది. యువకుడిని కింద పడేసి కాలితో తన్నడం చేసింది. అంతేకాకుండా ఆడపిల్లలను  ఇంకోసారి వేధించావ్ అంటే తాటతీస్తా అంటూ హెచ్చరించింది. నన్ను వదిలేయ్ అంటూ ఆ యువకుడు ఎంత ప్రాధేయపడినా యువతి మాత్రం శాంతించలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: