సరదాగా ఆ పని చేసిన పిల్లలు.. చివరికి ప్రాణం పోయింది?

praveen
దేవుడు ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల లాంటివి మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇవన్నీ చాదస్తపు మాటలు అని కొట్టి పారేస్తూ ఉంటారు.  తెర మీదికి వచ్చిన కొన్ని ఘటనలు చూసిన తర్వాత నిజమే అని నమ్ముతు ఉంటారు. ఎందుకంటే నేటి రోజుల్లో మనిషి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటనలు చివరికి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటాయి. ఇలా విధి ఆడిన వింత నాటకంలో ఎన్నో కుటుంబాలు విషాదంతో మునిగిపోయి అరణ్యరోదనగా విలపిస్తూ ఉంటాయి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఆడుకున్న విద్యార్థులు  ఎండ బాగా ఉండడంతో నీటిలోకి దిగి స్నానం చేయాలని అనుకున్నారు. కానీ అక్కడే వారి కోసం మృత్యువు కాచుకు కూర్చుంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయారు. చివరికి ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృతి చెందిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్లో వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం ఆర్.కె.నగర్ కు చెందిన పరశురాం, నరసింహ అన్నదమ్ములు వృత్తిపరంగా వీరిద్దరూ కూడా డ్రైవర్లు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 నరసింహ చిన్న కొడుకు దుర్గాప్రసాద్ ఆరవ తరగతి చదువుతుండగా.. పరుశురాం కొడుకు శ్రీకాంత్.. ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇకపోతే ఇటీవల నర్సింహా పెద్దకొడుకు రాఘవేందర్ తో కలిసి దుర్గాప్రసాద్, శ్రీకాంత్ సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే సరదాగా ఈత నేర్చుకోవాలని అనుకున్నారూ. కానీ ప్రమాదవశాత్తు దుర్గాప్రసాద్ శ్రీకాంత్ ఇద్దరు కూడా నీటిలో మునిగిపోయారు. గమనించిన రాఘవేందర్ కేకలు వేయడంతో సమీపం లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు వచ్చి లో మునిగి పోయిన శ్రీకాంత్ దుర్గాప్రసాద్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: