చాక్లెట్ కోసం సరిహద్దు దాటాడు.. చివరికి?

praveen
సాధారణంగా చాక్లెట్స్ తినడం ప్రతి ఒక్కరికి ఎంతగానో ఇష్టం ఉంటుంది. మరికొంతమంది ఇక చాక్లెట్ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంతగానో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఎప్పుడైనా చాక్లెట్ తినాలి అనిపించింది అంటే పక్కనే ఉన్న షాప్ లోకి వెళ్లి చాక్లెట్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ మనకు కావాల్సిన చాక్లెట్లు లేకపోతే మరో షాప్ కి వెళ్లి కొంటూ ఉంటాం. కానీ కేవలం ఒక చిన్న చాక్లెట్ కోసం దేశాలు దాటి పోవడానికి ఎవరైనా ఇష్టపడతారా. మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉంది చాక్లెట్ కోసం ఎవరైనా దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోతారా.. ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా అని అంటారు ఎవరైనా.

 మీరు జోక్ అనుకున్నారు అంటే మాత్రం అది మీ పొరపాటు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. చాక్లెట్ కోసం ఒక బాలుడు పెద్ద సాహసం చేశాడు. తాను ఉంటున్న ప్రాంతంలో చాక్లెట్ దొరకదు అనుకున్నాడో ఏమో ఏకంగా దేశ సరిహద్దులను దాటుకుని భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని గమనించిన సిబ్బంది పట్టుకొని ప్రశ్నించగా  అతను చెప్పిన సమాధానం తో ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు ప్రాంతాలలో చోటుచేసుకుంది.. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

 భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే దేశాల్లో  షౌల్టా నది సమీపంలోని ఓ గ్రామానికి  చెందిన బాలుడికి భారత్లో జరిగే చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఆ చాక్లెట్లు కొనుగోలు చేయడం కోసం అప్పుడప్పుడూ త్రిపుర సాల జిల్లాలోని కలాం చౌరా గ్రామానికి వస్తూండేవాడు. ముందు షౌల్టా నది దాటి భారత్ వైపు వచ్చే వాడు. దగ్గర్లోని దుకాణాల్లో చాక్లెట్లు  కొనుక్కొని అదే దారిలో తిరిగి వెళ్ళిపోయాడు. ఈనెల 13వ తేదీన కూడా ఇలాగే నది ఈదుకుంటూ భారత సరిహద్దు వద్దకు వచ్చాడు. కానీ ఈ సారి మాత్రం భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల కంట పడ్డాడు.. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న సైనికులు ఎందుకు వచ్చావు అని అడగడంతో చాక్లెట్ కోసం వచ్చాను అని అతను చెప్పిన సమాధానంతో అవాక్కయ్యారు. కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: