కామంతో ఊగిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు.. బాలుడిపై?

praveen
నేటి రోజుల్లో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలు కామ కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కామాంధులు రెచ్చిపోతూ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అన్నది కూడా ప్రతి తల్లిదండ్రులకు భయం భయంగానే మారిపోయింది. అయితే నేటి రోజుల్లో మనుషుల తీరు చూస్తే అటు సభ్యసమాజం ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

 అయితే మొన్నటి వరకు కామంతో ఊగిపోతూ ఆడపిల్లలపై మాత్రమే అత్యాచారాలకు పాల్పడే వారు. కానీ ఇటీవల కాలంలో ఏకంగా మూగజీవాల పై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటన సంచలనంగా మారిపోతున్నాయ్. వీధికుక్కల ను సైతం వదలకుండా అత్యాచారాలు చేస్తూ ఇక మూగజీవాలను బలితీసుకుంటున్న ఘటనలు సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో కేవలం బాలికలను మాత్రమే కాదు బాలురను కూడా ఎవ్వరు వదలడం లేదు అని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే బాలుర పై కూడా అత్యాచారం జరుగుతున్న ఘటనలు అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో ఆరేళ్ల బాలుడి పై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం కి పాల్పడ్డాడు. మిర్యాలగూడ కు చెందిన రాములు అనే వృద్ధుడు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఇక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు అన్నది తెలుస్తుంది. అయితే తీవ్ర రక్తస్రావమైనా విషయాన్ని ఆ బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో చివరికి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక బాలుడు పై అత్యాచారం జరిగినట్లు మిర్యాలగూడ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: