దారుణం : రేప్ అడ్డుకుందని.. ఏం చేసాడో తెలుసా?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇక సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఎక్కడ చూసినా మర్డర్ లు అత్యాచార ఘటనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మానవత్వం ఉన్న మనిషి కాస్త అడవిలో ఉన్న మృగం కంటే దారుణంగా మరి పోతున్నాడు. దీంతో సాటి మనుషుల విషయంలో కాస్తయినా జాలి దయ చూపించడం లేదు. దీంతో అడుగడుగునా ప్రతి ఒక్కరు భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆడపిల్లలు భద్రత అయితే రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతూ ఉంది.

 కోర్టులు ఎన్ని కఠిన శిక్షలు విధించినా ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అనే చెప్పాలి.  దీంతో ప్రతి రోజు ఆడపిల్ల భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఈ లోకంలో ఆడపిల్లలుగా పుట్టడం మేము చేసిన నేరమా అని ప్రతి ఒక్కరూ బాధ పడే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి ప్రతిఘటించింది అన్న కారణంతో దారుణంగా ప్రాణాలు తీశాడు ఆ యువకుడు.

 ఈ ఘటనతో స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అని చెప్పాలి. సాయి ప్రసాద్ అనే యువకుడు యువతి రేప్ చేయడానికి అడ్డొచ్చింది అనే కారణంతో హత్య చేశాడు. ఇక మరో గదిలో నిద్రిస్తున్న యువతి అమ్మమ్మ బయటికి వచ్చి చూడటంతో మనవరాలు రక్తపుమడుగులో కనిపించింది. దీంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది సదరు మహిళ. ఇటీవల యువతి తండ్రి మరణించడంతో తల్లి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళింది. దీంతో ఇక అమ్మమ్మతో ఒంటరి గానే ఉంటుంది సదరు యువతి. అమ్మమ్మతో ఉండడం గమనించిన సాయి ప్రసాద్ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డు చెప్పడంతో దారుణంగా నరికి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: