చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే.. మరో ప్రాణం పోయింది?

praveen
నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం మనుషుల అవసరాలను తీర్చడానికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది మొబైల్. ఇలా మనిషి అవసరాలు తీర్చడానికి వచ్చిన మొబైల్ కాస్త ఆ మనిషిని బానిసగా మార్చుకునీ ప్రపంచంతో పనిలేకుండా ఇక గంటల తరబడి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లోనే కాలం గడిపే విధంగా  తన వైపుకు తిప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఎంతోమంది మొబైల్ కి బానిస గా మారిపోతున్న వారిని చూస్తూ ఉన్నాము. అరక్షణం పాటు అరచేతిలో మొబైల్ లేకపోయినా కూడా ఏదో కోల్పోయినట్టు గా ఫీల్ అయిపోతున్నారు నేటి రోజుల్లో.

 ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అరచేతిలో మాత్రం మొబైల్ ఉండాల్సిందే. ఇక మనకు కావలసిన అన్ని రకాల అవసరాలు కూడా మొబైల్లోనే తీరిపోతూ ఉండటంతో ఈ ప్రపంచంతో పనిలేకుండా పోయింది ప్రతి మనిషికి. ఇటీవల కాలంలో మొబైల్ ఛార్జింగ్ పెట్టి కూడా వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇలా మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఉపయోగించడం వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఎవ్వరి లో మాత్రం మార్పు కనిపించడం లేదు. అయితే ఇటీవలే మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.

 ఇక ఈ ఘటన గురించి మరవకముందే ఇక ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అంతలా అర్జెంటు పని ఏం వచ్చిందో తెలియదు కానీ నీ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి అలాగే ఫోన్ మాట్లాడాడు. చివరికి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మైలారం గ్రామానికి చెందిన మల్లేశం అనే 45 ఏళ్ల వ్యక్తి మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా కరెంట్ షాక్ కి  గురయ్యాడూ. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: