కామపిశాచి.. కన్నతండ్రే.. కూతుళ్లపై కన్నేశాడు?

Chakravarthi Kalyan
కామాతురాణం న భయం..న లజ్జ.. అన్నారు. అంటే కామంతో కళ్లు మూసుకుపోయినవాడికి భయం, లజ్జ ఉండువు.. అని కామంతో బరితెగించే వాళ్లకు ఈ నానుడి వాడతారు. కానీ పాపం.. అప్పట్లో ఈ విషయం చెప్పిన వాళ్లకు ఆధునిక కాలంలో మరింత ఘోరమైన కామ పిశాచులు ఉంటారని.. వారికి భయం, లజ్జయే కాదు.. కనీసం వావి వరుసలు కూడా ఉండవని తెలియవేమో..ఎందుకంటే.. చివరకు కన్న తండ్రులు సైతం కన్నకూతుళ్లను చెరబడుతున్న దుర్మార్గపు రోజులు ఇవి.

తాజాగా వనస్థలిపురంలో జరిగిన దారుణం చూస్తే.. వీడూ ఒక మనిషనే అనిపించక మానదు. ముగ్గురు కూతుళ్లను కన్న కామపిశాచి.. వారిపై అత్యాచారానికి పాల్పడబోయి ఘటన వనస్థలిపురుంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ తండా వాసికి ఐదుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.. కూతుళ్ల వయస్సులు 20, 13, 11గా ఉన్నాయి. బతుకు తెరువు కోసం వనస్థలిపురంలోని ఓ కాలనీకి వలస వచ్చారు.  ఆటోడ్రైవర్‌ గా బతుకు బండి లాగుతూ ఆ దుర్మార్గుడు మద్యానికి బానిసయ్యాడు.

చివరకు తాగిన మత్తులో అతడి కన్ను ఎదిగిన సొంత కుమార్తెలపై పడింది. రోజూ తాగి వస్తూ కూతుళ్లను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన భార్య ఎప్పటికప్పుడు అడ్డుకునేది. తనకు అడ్డుగా ఉంటోందని భార్య ఈనెల 17న కొట్టి ఇంటి నుంచి పంపించేచాడు.  శుక్రవారం రాత్రి తాగి ఇంటికి వచ్చి 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేయబోయాడు. మిగిలిన ఇద్దరు కూతుళ్లు అరిచేసరికి భయపడిన వెళ్లిపోయాడు.

తండ్రి నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురు షీ టీమ్‌కు పోలీసులకు ఫోన్‌ చేసినా స్పందన లేకపోయంది. ఇక బతకడం దండగని ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ వారిని గమనించిన ఓ మహిళ చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ వారికి ఫోన్‌ చేసి వీరి వివరాలు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు పెట్టి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: