దారుణం: పుట్టిన కొడుకు కాళ్లు చేతులు తనలా లేవని.. భార్యను అలా చేసి మరీ..!

MOHAN BABU
 భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న సమస్యలు, గొడవలు సహజం, అలాంటి గొడవలు, అలకలు లాంటివి బుజ్జగింపుల తో సరిపెట్టుకుంటే పర్వాలేదు కానీ దాన్ని పెంచి పెద్దదిగా చేస్తే ఇబ్బందులు తప్పవన్నది సత్యం. ఆ మనస్పర్థల మధ్యలో ఏ ఒక్క చిన్న అనుమానం వచ్చినా పచ్చని కాపురంలో చిచ్చు వచ్చి పడ్డట్టే. ఆ చిచ్చు  ఎక్కడికి దారి తీస్తుందో మనం ఊహించలేము. తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ లో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భర్త యొక్క అనుమానం తన భార్య నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది.

 పూర్తి వివరాల్లోకి వెళితే విరుదునగర్ ఎన్జీవో కాలనీకి చెందినటువంటి కన్నన్ 11 సంవత్సరాల క్రితం ఒక యువతిని వివాహం చేసుకున్నారు. అది కూడా పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఆ యువతి కూడా గుణవంతురాలు. చూడటానికి ఎంతో విలక్షణంగా ఉంటుంది. దీంతో వారి కాపురం చాలా బాగా సాగుతూ వచ్చింది. ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు. ఇక పిల్లలు పుట్టాక అతని బుద్ధి మారింది. ఆ అమ్మాయికి ఉన్న అందమే అతని బుద్ధిని మార్చేసింది. దీంతో చిన్నచిన్న విషయాలకే చాలా అనుమానించే వాడు. భార్య ఎవరితో మాట్లాడిన అనుమానించే వాడు. వారితో నీకేం అవసరం, ఎందుకు మాట్లాడవు అంటూ ఆమెను సూటిపోటి మాటలతో వేధించేవాడు. చివరికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వచ్చినా వారితో ఎందుకు మాట్లాడాలని అనుమానంతో ఆమెను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఈ అనుమానం అంతటితో ఆగకుండా చివరికి తనకు పుట్టిన పిల్లల పోలికల వరకు వచ్చాయి. ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడికి నా పోలికలు సరిగా రాలేదని, అతని కాళ్ళు చేతులు తనలా లేవని తీవ్రంగా అనుమానించాడు.

 నువ్వు ఎవరితో తప్పు చేసావ్ అని భార్యను దారుణంగా హింసించి ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. జనవరి 10వ తేదీన భార్యాభర్తల మధ్య ఈ గొడవ చాలా ఎక్కువగా జరిగింది. మాటా మాటా పెరిగి పిల్లాడు నాకు పుట్టలేదని నువ్వు ఎవరితోనో తప్పు చేసి కన్నావు అని మాటలతో భార్యను దారుణంగా అవమాన పరిచాడు. దీంతో భార్య కూడా నేను ఏ తప్పు చేయలేదని అతనితో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్రంగా ఆగ్రహం పెంచుకున్న కన్నన్ భార్యను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయాలపాలైనది. ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో వివాహిత కుటుంబీకులు  ఆ వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: