ఏటిఎంలో చెవిటి-మూగ దొంగతనం.. అంత‌లోనే పెద్ద ట్విస్ట్‌..!

N ANJANEYULU
మామూలుగా దొంగ‌త‌నం చేయాలంటే కొంత మంది భ‌య‌ప‌డుతూ ఉంటారు. కొంత మంది మాత్రం దొంగ‌త‌న‌మే వారి అల‌వాటుగా చిన్న‌నాటి వృత్తిగా మ‌లుచుకుని ఎన్నిసార్లు ప‌ట్టుబ‌డినా త‌న వృత్తిని మాత్రం కొన‌సాగిస్తూనే ఉంటున్నారు. దొంగ‌త‌నం చేయ‌డం అంటే సాదార‌ణంగా ఎంతో ధైర్యం ఉంటే కాని దానికి ముంద‌డుగు వేయ‌లేరు. అటు పోలీసుల‌కు, ఇటు ప్ర‌జ‌ల‌కు ప‌ట్టుబ‌డ‌కుండా ఎంతో చాక‌చ‌క్యంగా ముంద‌స్తుగా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటే వారు చేసే దొంగ‌త‌నం స‌క్సెస్ అయిన‌ట్టే..
అందుకే దొంగ‌లు ముంద‌స్తుగానే రెక్కి నిర్వ‌హించి ఆ త‌రువాత త‌న ప్ర‌ణాళిక‌ను అస్త్రంగా వాడుకొని దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుంటారు. అదేవిధంగా ఏటీఎంల‌లో డ‌బ్బులు దొంగిలించాలంటే ఓ వైపు సీసీ కెమెరాలు, మ‌రోవైపు సెక్యూరిటీల మ‌ధ్య దొంగ‌త‌నం చేయ‌డం అస‌లు సాధ్యం కాదు.  ఆ దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తి ఎవరికైనా ప‌ట్టుబ‌డితే ఇక ప‌రువు పోతుంద‌ని కూడా ఆలోచించి అన్ని అస్త్రాల‌ను సిద్ధం చేసుకొని వారు రంగంలోకి దిగి త‌న ప‌ని కానిస్తుంటారు.
అయితే తాజాగా ఓ వింత విష‌యం చోటు చేసుకుంది. ఇది విచిత్రం ఏమిటంటే.. అన్ని అవ‌యాలు ఉన్న వారు చేసే దొంగ‌త‌నం ఒక ఎత్త‌యితే.. ఒక చెవిటి, ఒక మూగ వారు దొంగ‌త‌నం చేయ‌డం మ‌రొక ఎత్తు.. ఆ దొంగ‌కు అవ‌గాహ‌న లేక‌నో లేక ఏమి జ‌రిగిందో తెలియ‌దు కానీ ఏకంగా ఏటీఎంలోనే దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు. ఎవ‌రూ చూడ‌రు అనుకొని డ‌బ్బులు తీసేందుకు ప్ర‌య‌త్నం చేసాడు. విజ‌య‌వంతంగా డ‌బ్బులు తీసే ప్ర‌య‌త్నం చేసారు. కానీ సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న విష‌యాన్ని గ్ర‌హించని ఆ దొంగకు చెవులు విన‌ప‌డ‌క‌పోవ‌డం తోడు అయినది. అదే స‌మ‌యంలోనే  ట‌క్కున అని అలారం మోగింది. ఆ దొంగ చెవిటి కావ‌డంతో వినిపించ‌క‌పోవ‌డంతో త‌న ప‌ని తాను చేసుకూ పోతున్నాడు.
అలారం మోగిన విష‌యాన్ని గ‌మ‌నించిన బ్యాంకు అధికారులు వెంట‌నే అలెర్ట్ అయి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు  దొంగ‌త‌నం జ‌రుగుతున్న ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకున్నారు. పోలీసులు చేరుకునేంత వ‌ర‌కు దొంగ‌కు అస‌లు తెలియ‌నే తెలియ‌దు. పోలీసులు ఒక్క‌సారిగా ఎటీఎం వ‌ద్ద‌కు  రావ‌డంతో ఆ దొంగ షాక్‌కు గుర‌య్యాడు. ఆ దొంగ‌ను అరెస్ట్ చేసి పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న‌ది.
పోలీసుల విచార‌ణ‌లో ఆ దొంగ పేరు డిలోడ్ సునీల్ అని, అత‌నికి మాట‌లు రావ‌ని, చెవులు వినిపించ‌వ‌ని వెల్ల‌డి అయిన‌ది. నిజామాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా  సునీల్ విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఉద్యోగం ద్వారా వ‌చ్చే డ‌బ్బులు స‌రిపోక‌పోవ‌డంతో ఎలాగైనా డ‌బ్బులు సంపాదించాల‌నే ఆలోచ‌న‌తో ఏటీఎంలో చోరీకి య‌త్నించాడు. కానీ ఆ దొంగ‌కు చెవులు వినిపించ‌క‌, అలారం శ‌బ్దం మ్రోగినా గ‌మ‌నించ‌కుండా చోరీ చేస్తూ చిక్కాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. సునిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం అని చెప్పారు పోలీసులు. ఇటీవ‌ల జిల్లాల‌లో జ‌రిగిన ప‌లు దొంగ‌త‌నాల‌పై కూడా ఆరా తీస్తున్నారు. ప్ర‌స్తుతం చెవిటి, మూగ వ్య‌క్తి చేసిన దొంగ‌త‌నం సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫోటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: