దొంగతనం కోసం బరువు తగ్గాడు.. చివరికి?

praveen
వామ్మో ఇటీవలికాలంలో దొంగలు ఎంతో ప్రొఫెషనల్గా మారిపోయారు అనే చెప్పాలి. ఏదో ఒక మంచి వృత్తిలో  కొనసాగుతున్నట్లు గా దొంగతనం చేసే సమయంలో ఎంతో ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద పెరిగి పోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఎంతోమంది సోషల్ మీడియాలో చూసి యూట్యూబ్ వేదికగా దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుని చోరీలకు పాల్పడుతున్న లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో ఇంకొంతమంది ఇంట్లో పని వాళ్ళ లాగా చేరి మంచి వాళ్ళలా నటిస్తూ  సమయం చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

అయితే ఇక్కడ ఒక దొంగ మాత్రం చాలా డిఫరెంట్. అతను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఈ క్రమంలోనే అతను అంత లావుగా ఉంటే దొంగతనం చేయడం కష్టమని భావించి.. ప్రొఫెషనల్ దొంగ గా మారిపోయాడు. ఏకంగా ఒక దొంగతనం చేయడానికి పది కేజీల బరువు తగ్గాడు ఆ దొంగ. సాధారణంగా ఇప్పటివరకూ సినీ సెలబ్రిటీలు ఇలా సినిమాల కోసం ఎక్సర్సైజులు చేసి జిమ్లో కష్టపడే బరువు తగ్గడం లాంటివి చూసాము. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం చోరీ చేయడానికి బరువు తగ్గడం  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్లో మోహిత్ మారడియా అనే వ్యక్తి ఇంట్లో మోతీ సింగ్ అనే వ్యక్తి పనికి చేరాడు  ఇక ఇంట్లో ఎంతో నమ్మకస్తుడిగా ఉంటూనే ఇంట్లో నగదు బంగారం ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకొన్నాడు. అంతేకాదు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా గమనించాడు. అయితే ఇంటికి ఎలక్ట్రానిక్ డోర్లు ఉండడంతో కిటికీ ద్వారా లోపలికి వెళ్లడానికి సన్నబడాలి అని అనుకున్నాడు.. దీంతో ఏకంగా పది కేజీల బరువు తగ్గాడు. అయితే ఇటీవలే ఏకంగా కిటికీలోంచి లోపలికి వెళ్లి చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా పట్టుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: