కొడుకుని 30 ఏళ్ళు బంధించిన తల్లి... అసలు ఏం జరిగింది...?
70 ఏళ్ల వయసులో అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఒక బంధువు వారి ఇంటికి వెళ్ళగా... 41 ఏళ్ల వ్యక్తిని ఆదివారం కనుగొన్నారు. ఈ వ్యక్తి తన కాళ్ళపై పుండ్లు పడ్డాయి అని నడవలేకపోయాడు అని పోలీసులు చెప్పారు. అతను కనీసం మాట్లాడలేకపోతున్నాడు అని పేర్కొన్నారు. అతను ఆస్పత్రిలో ఉన్నాడు అని అతని గాయాలు ప్రానంతకం కాదని పోలీసులు వెల్లడించారు. ఈ నేరాలను తల్లి ఖండించినట్లు స్వీడిష్ ప్రాసిక్యూషన్ అథారిటీ తెలిపింది.ఈ కేసుపై ఆసుపత్రి వైద్యులు పోలీసులను అప్రమత్తం చేశారు.
మంగళవారం అపార్ట్ మెంట్ తలుపు మీద ఆధారాలను సేకరించారు. ప్రతీ ఆధారాన్ని కూడా సేకరించాలి అని పోలీసులకు చెప్పారు. అపార్ట్ మెంట్ హనింగే మునిసిపాలిటీలోని హ్యాండెన్ లో ఉంది. ఆ వ్యక్తిని కనుగొన్న గుర్తు తెలియని బంధువు మాట్లాడుతూ, అపార్ట్ మెంట్ కొన్నేళ్లుగా శుభ్రం చేయబడలేదు చెప్పాడు. "మూత్రం, ధూళి ఉంది, ఇది కుళ్ళిన వాసన వస్తుంది అని చెప్పాడు. "నేను షాక్ లో ఉన్నాను, నా హృదయం బాధతో నిండిపోయింది అని చెప్పాడు. అయితే ఆమె కొడుకుని ఎందుకు అలా బంధించింది ఏంటీ అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.