దేవుడా.. ఐస్ క్రీమ్ తో దోస.. ఛీ..ఛీ..

Satvika
ఈ మధ్య ఒక వైపు కరోనా మూలాలు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు కొందరు భయం తో వణికిపొతే మరి కొందరు మాత్రం పిచ్చి పట్టి ఏదేదో కొత్తగా చెస్తున్నారు. అందులో ముఖ్యంగా వెరైటీ వంటలను చేస్తూ జనాలకు పిచ్చి ఎక్కిస్తున్నారు. ఇలా చాలా వంటలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.. అందులో కొన్ని జనాలకు తిండి మీద అసహ్యాన్ని కలిగిస్తుంది. మరి కొన్ని వీడియోలు విపరీథంగా ఆకర్షిస్తున్నాయి. పానిపూరి ఐస్ క్రీం, ఓరియో బిస్కెట్లతో పకోడి, పానిపూరి నూడిల్స్, పానీపూరి గులాబ్ జామ్ వంటి వెరైటీలను చేస్తున్నారు.

ఇలాంటి వెరైటీలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ఎందరికో ఆ కొత్త వంటలను పరిచయం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఐస్ క్రీమ్ దోస అనేది నెట్టింట వైరల్ అవుతుంది.. దాన్ని తయారు చేసే విధానం కొందరికి చిరాకు తెప్పిస్తె మరి కొందరికి మాత్రం వింధు భోజనం అయ్యింది. నిజంగానే వెరైటీగా ఉన్న ఈ దొసను తినడానికి జనాలు కూడా ఆసక్తి చూపించి మరింత వైరల్ అయ్యేలా చెస్తున్నారు.

విషయాన్నికొస్తే..వ్యాపారి మసాలా దోసెతో ఐస్ క్రీమ్ రోల్ తయారుచేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చెస్తుంది.మసాలా దోసె, ఆనియర్‌దోసె, ఎగ్‌ దోసె, రవ్వ దోసె, పేపర్ రోస్ట్ దోసె, నెయ్యి దోసె, పన్నీర్‌ దోసె ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దోసెలు మనకు తెలుసు.ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి మాత్రం దోసెలో సరికొత్త ప్రయోగం చేశాడు. మసాలా దోసెతో ఐస్ క్రీం రోల్ తయారుచేశాడు. ఇందు కోసం అతను దొసను ముందుగా చిన్న ముక్కలు చేశాడు.అందులో ఐస్ క్రీం కలుపుతారు. రెండింటినీ బాగా మిక్స్ చేసి రోల్ చేస్తాడు. ఆ తర్వాత వాటి పై మసాలా వేసి చట్ని ఇస్తాడు.దీనిలో ఏముందో తెలియదు కానీ అద్భుతం అంటున్నారు. ఆ దోస వీడియో మీరు కూడా చూడండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: