చికెన్ సమోసా ఎలా అంటే...!

Sahithya
సమోసాలు అనేవి చాలా మందికి ఇష్టం. అందులో మనం చాలా రకాల సమోసాలు చేసుకోవచ్చు. అలాగే చికెన్ సమోసాలు కూడా చేసుకోవచ్చు. అసలు అవి ఎలా చేసుకోవచ్చు ఏంటీ అనేది చూద్దాం.
దానికి ఎం కావాలో చూద్దాం. ఉడికించిన చికెన్ : 450 గ్రాములు, ఉల్లిపాయలు : రెండు పెద్దవి, పచ్చిమిర్చి : నాలుగు కావాలి. అలాగే అల్లం తరుగు : రెండు చెంచాలు కావాలి. పసుపు : పావు చెంచా కావాలి/ మిరియాల పొడి : అర స్పూన్ కావాలి. చికెన్ మసాలా : రెండు స్పూన్, కరివేపాకు : కొద్దిగా, కొత్తిమీర : కొద్దిగా, ఉప్పు : తగినంత వేయండి. అలాగే నూనె : వేయించేందుకు సరిపడా కావాలి.  మైదా : ఒకటిన్నర కప్పు, గోరువెచ్చని నీళ్లు  కావాలి.
మైదాను ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, చెంచా నూనె వేసి కలపండి. ఆ తరువాత నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టండి. ఇప్పుడు పాన్ ని స్టౌపై పెట్టి రెండు చెంచాల నూనె వేయండి. అప్పుడు వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. అవి గోధుమ రంగులోకి మారాక అల్లం తురుము వేయండి.  పచ్చిమిర్చి ముక్కలూ, కరివేపాకు వేయండి.  రెండు నిమిషాల అయిన తర్వాత పసుపు వేయండి. మిరియాలపొడి, చికెన్ మసాలా, సన్నగా కోసిన చికెన్ వేయండి.. చికెన కాస్త మెత్తబడ్డాక తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి దించండి. దీన్ని చల్లారిన తర్వాత నానిన మైదా పిండిని చపాతీలా చేసి నిలువుగా కోయండి. ఒక భాగాన్ని త్రికోణాకృతిలో చుట్టి రెండు స్పూన్‌ ల చికెన్ మసాలాను ఉంచి సమోసా ఆకృతిలో తయారు చేసుకోండి. అప్పుడు అంచులు మూసి వేయాలి. ఇలానే మిగిలిన పిండిని చేసుకుని రెండు మూడు చొప్పున కాగుతున్న నూనెలో వేయండి. అంతే రెడీ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: