ఎగ్ ఫింగర్స్ చాలా ఈజీ...!

Sahithya
చికెన్ తో పాటుగా కోడి గుడ్డుతో కూడా చాలా వంటలు చేసుకునే అవకాశం ఉంది. ఎగ్ ఫింగర్స్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. కోడి గుడ్లు - ఎనిమిది, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీ స్పూన్‌, కార్న్‌ ఫ్లోర్‌ - పావు కప్పు, నూనె - సరిపడా, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌ - పావు కప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ - అర టీ స్పూన్‌, బ్రెడ్‌ క్రంబ్స్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు కావాలి.

తయారు ఎలా చేయాలంటే...  ముందుగా ఒక పాత్రలో కోడి గుడ్లు కొట్టి వేసుకుని... ఆ తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.  అప్పుడు వెడల్పాటి పాన్‌ తీసుకుని నూనె రాసి అందులో కోడిగుడ్ల మిశ్రమం పోసుకోవాలి. అప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని స్టవ్‌ పై  పెట్టి... మధ్యలో చిన్న స్టాండ్‌ లాంటిది పెట్టి దానిపై కోడి గుడ్ల మిశ్రమం పోసిన పాన్‌ పెట్టి మూత పెట్టుకోవాలి. నీళ్లు పోసిన పాత్రపై కూడా మూత పెట్టండి. చిన్న మంటపై కనీసం అర గంట పాటు ఉడికించండి.

ఆ తరువాత నెమ్మదిగా బయటకు తీసి ఊతప్పం మాదిరిగా అయిన వెంటనే దీన్ని వేరే ప్లేట్‌ లోకి మార్చండి. అప్పుడు కత్తితో ఫింగర్స్‌ మాదిరిగా కట్‌ చేసుకుని... మరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌, ఆల్‌ పర్పస్‌ ఫ్లోర్‌, తగినంత ఉప్పు వేసి... చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలపండి. మరొక ప్లేట్‌లో కోడి గుడ్లు కొట్టి వేసి చిటికెడు ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు కట్‌ చేసి పెట్టుకున్న ఫింగర్స్‌ ను పిండి మిశ్రమంలో కొంచెం అద్దుతూ, కోడిగుడ్డు సొనలో ముంచండి. ఆతరువాత బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దండి. స్టవ్‌ ఒక పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయిన తర్వాత బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్దిన ఫింగర్స్‌ వేసి వేయించండి. అంతే...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: