జామ ఊరగాయ తిన్నారా...? ఎలా చేసుకోవాలో తెలుసా అసలు...!

Sahithya
సృష్టిలో ఉన్న ప్రతీ ఒక్కటి కూడా మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది.  ప్రతీ ఒక్క కాయతో కూడా మనం ఎంతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. జామ కాయతో కూడా చాలా రుచికరమైన పచ్చడి చేసుకోవచ్చు. చాలా మంది జామ కాయ అంటే ముక్కలు కోసుకుని తింటారు కదా అనుకుంటారు. కాని జామ కాయతో చాలా రుచికరమైన ఊరగాయ మనం తయారు చేసుకోవచ్చు.

అసలు దానికి ఏమి ఏమి కావాలి అనేది ఒకసారి చూస్తే... జామ కాయ ముక్కలు- ఒక కప్పు తీసుకోండి. ఆవాలు, జీలకర్ర,- ఒక్కోటి ఒక్కో టీ స్పూను తీసుకోవాలి. అలాగే మెంతులు- అర టీ స్పూను. ఎక్కువ తీసుకోవద్దు... వేరు శెనగ నూనె – తగినంత... అంటే మీ వాడకం అంత.. ఎండు మిర్చి- మూడు చాలు.  అలాగే కరివేపాకు రెండు రెబ్బలు చాలు. ఇంగువ చిటికెడు వేయండి.  చింతపండు గుజ్జు- అర కప్పు కావాలి. పచ్చి మిర్చి మూడు కాయలు చాలు. చక్కెర, పసుపు - ఒక్కో టీ స్పూను వేసుకోండి  ఉప్పు- తగినంత వేసుకోవాల్సిన అవసరం ఉంది. కారం- ఒక టేబుల్‌ స్పూను, నిమ్మకాయ- ఒకటి చాలు.

అదే విధంగా తయారి విధానం ఒకసారి చూస్తే... ఆవాలు, జీలకర్ర, మెంతులను కనీసం... రెండు నిమిషాల పాటు కళాయిలో నూనె లేకుండా వేయించండి. ఇవి చల్లారిన తర్వాత... మిక్సీలో గ్రైండ్‌  చేసుకోవాలి. ఒక పాన్‌లో వేరుశెనగ నూనె వేసి అది వేడి ఎక్కిన ఆతర్వాత... ఎండుమిర్చి, కరివేపాకు, జామ కాయ ముక్కలు అలాగే ఇంగువ వేసి వేయించుకోవాలి. అందులోనే చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి తరుగు వేసుకుని... నిమ్మముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అందులో చక్కెర, పసుపు, ఉప్పు,  కారం  కూడా కలిపి మరికొంత సేపు ఉడికించి... చివరిగా మిక్సీ పట్టిన పొడిని వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. అంతే ఊరగాయ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: