'పైనాపిల్‌ కీర సలాడ్‌'తో ఎన్ని లాభాలో!

Durga Writes

పైనాపిల్‌ కీర సలాడ్‌.. ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకేంటి అండి.. మనకు మంచి బలాన్ని మనం లావు తగ్గేలా చేసే పండు పైనాపిల్ కీర సలాడ్.. మేలైన పోషకాలతో పాటు శరీరానికి తగినంత నీరు కూడా అందిస్తుంది ఈ పైనాపిల్ కిర సలాడ్. ఈ సలాడ్ తో చర్మం పొడిబారటం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాదు చర్మం కొత్త కాంతిని అందిస్తుంది. అందుకే అన్ని లాభాలు అందించే రుచి, పోషకాల సమాహారమైన పైనాపిల్‌ కీర సలాడ్‌ ను ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

పైనాపిల్‌ ముక్కలు -1 కప్పు, 

 

కీరా తరుగు - 1 కప్పు, 

 

చెర్రీ టొమాటోలు -6, 

 

లెట్టూస్‌ తరుగు- అరకప్పు, 

 

కొత్తిమీర తరుగు - 2 చెంచాలు, 

 

నిమ్మరసం - 2 చెంచాలు, 

 

తేనె - చెంచా, 

 

శెనగపప్పు - చెంచా, 

 

 

ఉప్పు, నల్ల మిరియాల పొడి- రుచికి తగినంత.

 

తయారీ విధానం.. 

 

 

ఒక పెద్ద గిన్నెలో నిమ్మరసం, తేనె, శెనగపప్పు పొడి, ఉప్పు, బ్లాక్‌ పెప్పర్‌ పొడి వేసి బాగా కలిపి అందులో పైనాపిల్‌, కీరా, చెర్రీ టొమాటో ముక్కలు, లెట్టూస్‌ ఆకులు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. అంతే సలాడ్‌ రెడీ. ఇంకా ఈ సలాడ్ ని అప్పటికప్పుడు తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా మీకు సమయం ఉన్నప్పుడు ఈ సలాడ్ ను చేసుకొని తినేయండి..               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: