ఆధార్ : ఇక ఇంటి నుంచే అన్ని అప్డేట్ చేసుకోవచ్చు!

Purushottham Vinay
ఆధార్ కార్డుని అప్‌డేట్ చేసుకోవాలా? అందుకోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక ఒక క్షణం ఆగండి.. మీరు అసలు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.ఉన్నచోటనే కేవలం ఇంట్లో కూర్చొనే మీ ఆధార్ కార్డులో వివరాలను చాలా సులభంగా మార్చుకోవచ్చు. సాధారణంగా ఈ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలంటే.. దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రానికి లేదా పోస్టాఫీసుకు మీరు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, త్వరలో ఆధార్‌ను కలిగిన ప్రతిఒక్కరూ కూడా తమ ఇళ్లలో సౌకర్యవంతంగా కార్డు వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించడం జరిగింది.ఫోన్ నంబర్ లేదా ఫోటోను అప్‌డేట్ చేసినా ఇక అన్ని ఆధార్ సేవలు కూడా త్వరలో ఇంటి వద్దనే పొందవచ్చు.ఇక ఈ డోర్‌స్టెప్ ఆధార్ సేవలను పోస్టాఫీసు ద్వారా అందించనున్నట్లు uidai వెల్లడించింది. మీడియా నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే uidai ప్రస్తుతం 48,000 మంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పోస్ట్‌మెన్‌లకు అవగాహనని కల్పిస్తోంది. ఇంటి వద్దనే మీరు ఆధార్ సేవను పొందవచ్చు. అలాగే త్వరలో పోస్ట్‌మెన్‌లు ఉత్తరాలను బట్వాడా చేయడమే కాకుండా మీ ఇంటి వద్దే ఆధార్ సంబంధిత సేవలను కూడా వారు అందిస్తారు.ఫోన్ నంబర్‌ను లింక్ చేయడం ఇంకా ఫోటో అడ్రస్ మార్చడం వంటి ఇతర సేవలతో సహా ఆధార్ సేవలు ఇంటి వద్దనే పొందవచ్చు.


ఇక నివేదికల ప్రకారం.. మొదటి దశలో, uidai ఈ పోస్ట్‌మెన్‌లను ఇంటింటికీ కూడా దేశంలోని దూర ప్రాంతాలకు కూడా వెళ్లడానికి శిక్షణ ఇస్తుంది.అలాగే రెండవ దశలో మొత్తం 1.5 లక్షల మంది పోస్టల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే uidai డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ఆధారిత ఆధార్ కిట్‌తో సహా తగిన డిజిటల్ డివైజ్‌లతో పోస్ట్‌మెన్‌లను సన్నద్ధం చేస్తుందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. వీటితో పోస్ట్‌మెన్‌లు కేవలం కొన్ని క్లిక్‌లతో ఆధార్ యూజర్ల డేటాను  కూడా అప్‌డేట్ చేయనున్నారు.డోర్‌స్టెప్ ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను చాలా సజావుగా నిర్వహించడంలో సాయపడేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దాదాపు 13వేల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను ఎన్‌రోల్ చేయాలని uidai ఆలోచిస్తుందని నివేదిక పేర్కొంది. ఇక అలాగే ప్రస్తుతం.. ఫోన్ నంబర్ వంటి అనేక ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇక మీకు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని లేదా పోస్టాఫీసును మీరు సందర్శించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: