హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులు అల‌ర్ట్‌.. నియ‌మాలు మారాయి తెలుసుకోండి..?

N ANJANEYULU
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు పంపే సందేశాల‌కు చార్జ్ చేస్తుంది. బ్యాంకు ఖాతాదారులు ఇప్పుడు ఒక మెస్సెజ్ కి 20 పైస‌లు, జీఎస్టీ చెల్లించాలి. ఈ స‌ర్వీస్‌కు బ్యాంకు ఇన్‌స్టా అల‌ర్ట్ స‌ర్వీస్ అని పేరు. దీని ద్వారా ఖాతాదారుల‌కు మెస్సెజ్‌లు, ఈ మెయిల్‌ల ద్వారా స‌మాచారం అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ కొత్త రూల్ గురించి త‌న వెబ్‌సైట్‌లో తెలిపింది. ఒక త్రైమాసికంలో ఇన్‌స్టా అల‌ర్ట్ సేవ‌ల‌కు మూడు రూపాయ‌లు ఛార్జీ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ది. అయితే ఒక్కో మెస్సెజ్‌కు 20 పైస‌లు, జీఎస్టీ క‌లిపి వ‌సూలు చేస్తారు. కానీ ఈ మెయిల్‌కు హెచ్చ‌రిక మునుప‌టిలా ఉచితంగానే ఉంటుంది. ఈ మెయిల్ ద్వారా పంపిన మెస్సెజ్‌కు క‌స్ట‌మ‌ర్ నుంచి ఎటువంటి ఛార్జ్ వ‌సూలు చేయ‌దు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు ఇన్‌స్టా అల‌ర్ట్ నుండి బ్యాంకు లావాదేవీల స‌మాచారం పొందుతారు. ఈ హెచ్చ‌రిక‌ల ద్వారా ఖాతాదారుల‌కు ఆర్థిక లేదా ఆర్థికేత‌ర స‌మాచారం అందిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుండి డ‌బ్బును విత్ డ్రా చేయ‌డం లేదా డిపాజిట్ చేయ‌డం లేదా ఏటీఎం నుండి మినిస్టేట్‌మెంట్ చూడ‌డం, లేదా బ్యాలెన్స్ చెక్ చేయ‌డం వంటివి క‌స్ట‌మ‌ర్ల‌కు ఇన్‌స్టా అల‌ర్ట్ స‌ర్వీస్ ద్వారా తెలియ‌జేస్తున్న‌ది. ఒక్కో మెస్సెజ్‌కి 20 పైస‌లు, జీఎస్టీ చెల్లించాలి. ఇన్‌స్టా అల‌ర్ట్ స‌ర్వీస్ ద్వారా బిల్లు గ‌డువు తేదీ జీతం, క్రెడిట్ ఖాతాలో త‌క్కువ బ్యాలెన్స్ మొద‌లైన వాటి గురించిన స‌మాచారం కూడా తెలియ‌జేస్తుంది. అయితే ఈ సేవ‌ను తీసుకోవ‌లా వ‌ద్దా అనేది క‌స్ట‌మ‌ర్‌పై ఆదార‌ప‌డి ఉంటుంది.
నెట్ బ్యాంకింగ్ లావాదేవీ హెచ్చ‌రిక‌లు ఇన్‌స్టా అలెర్ట్ సేవ‌ల్లోకి రావు. ఇన్‌స్టా అల‌ర్ట్ స‌ర్వీస్ న‌మోదుచేసుకోని క‌స్ట‌మ‌ర్లు ఎవ‌రైనా ఉన్న‌ట్టు అయితే  చేసుకోవాల‌ని బ్యాంకు ఉచితంగా హెచ్చ‌రిక‌లు పంపుతుంది. కానీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లావాదేవీల‌కు సంబంధించిన హెచ్చ‌రిక‌లు పంప‌లేదు. ఈ సేవ‌లు కేవ‌లం ఇన్‌స్టా అల‌ర్ట్ ద్వారా మాత్ర‌మే తెలుస్తాయి. మీరు బ్యాంకు నుంచి మెస్సెజ్‌లు పొందాల‌నుకుంటే మాత్రం మీ మొబైల్ ఫోన్ నెంబ‌ర్, ఈ మెయిల్ ఐడీ బ్యాంకుతో అప్‌డేట్ అయి ఉండాల‌ని త‌ప్ప‌కుండా  గుర్తుంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: