ఆదాయం : రైల్వే.. దండుకుంది..!

Chandrasekhar Reddy
కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించినట్టే రైల్వే కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. దానితో ఈ శాఖకు కూడా ఆదాయం గండి పడ్డట్టే. అయితే అనంతరం కాస్త వెసులుబాటుతో, కరోనా నిబంధనలతో కొన్ని రైళ్లను ప్రత్యేకంగా నడిపింది ఆ శాఖ. దానితో కాస్త ఆదాయం చూడగలిగింది. తరువాత మళ్ళీ రెండో వేవ్ లో కాస్త ఇబ్బందికర పరిస్థితి చూడాల్సి వచ్చినప్పటికీ, రైల్వే అప్పట్లో కొన్ని బోగీలను క్వారంటైన్ కు కూడా ఉపయోగించింది. ఈ పరిస్థితులలో కూడా అత్యవసర ప్రయాణాలు కరోనా నిబంధనలతో నడిచాయి. ప్రస్తుతం దాదాపుగా అన్ని రైళ్లు మళ్ళీ యాధస్థితికి వచ్చినట్టే. అయినప్పటికీ కరోనా ఇంకా పోలేదు కాబట్టి తగిన జాగర్తలతో ప్రయాణాన్ని అనుమతిస్తుంది రైల్వే శాఖ.
ఇలా రైల్వే కూడా కరోనా సమయంలో ఒడిదుడుకులను చవిచూడాల్సి వచ్చింది. అయినా కూడా గత ఏడాది నవంబర్ వరకు 9534.19 కోట్లు గా తేలింది. ఇందులో ప్రయాణికుల రాకపోకలు మాత్రమే కాకుండా సరకు రవాణా బాగా ప్రభావం చూపాయని చెప్పాలి. అందునా భారతీయ తూర్పు మధ్య రైల్వే ఆదాయం బాగా పెరిగినట్టు తెలుస్తుంది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఆర్థిక ఏడాదికి 2021-22మొదటి ఎనిమిది నెలలలో(ఏప్రిల్ 2021-నవంబర్ 2021)14184.38 ఆదాయాన్ని చవిచూడగలిగింది. ప్రయాణికుల సేవలలో కూడా గతంలో పోలిస్తే ఆదాయం పెరుగుదల కనిపించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
నవంబర్ వరకు కేవలం ప్రయాణికుల రద్దీ ద్వారా వచ్చిన ఆదాయం 1620.11 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు అయ్యింది. ఒక్క నవంబర్ లో మాత్రమే 224.05 కోట్ల ఆదాయం ప్రయాణికుల ద్వారా వచ్చింది. గతంతో పోలిస్తే 87.44 శాతం ఎక్కువ. ఇక సరకు రవాణాలో తూర్పు మధ్య రైల్వే బాగా ఆదాయం ఆర్జించింది. ఈ ఆర్థికసంవత్సరంలో 104.56 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయబడింది. గతంలో ఇది కేవలం 86.76 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే 20.52 శాతం ఎక్కువ. ఆదాయం విషయానికి వస్తే, 12316.2 కోట్లు, ఇది గతంతో పోలిస్తే, 39.25 శాతం ఎక్కువ. అలాగే కోచింగ్ ల వలన వచ్చిన ఆదాయం 150.73 కోట్లుగా ఉంది. గతంలో ఇది 66.57కోట్లుగా ఉంది, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 126 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: