900 మందిని ఫైర్ చేసిన ఇండియా సీఈఓ గతేంటో తెలుసా?

Podili Ravindranath
ఏ నిమిషానికి ఏమి జరుగునో... ఎవరు ఉహించెదరు అంటూ లవకుశ సినిమాలో ఘంటసాల వెంకటేశ్వర రావు పాడిన పాట... ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగులకు సరిగ్గా సరిపోతుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు అనే సామెత మాదిరి ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ముఖ్యంగా కరోనా వైరస్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అసలు ఉంటుందో... లేదో కూడా తెలియటం లేదు. ప్రదానంగా కార్పొరేట్ సెక్టార్‌లో పరిస్థితులు అసలు అర్థం కావటం లేదు. ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ గార్గ్ వ్యవహారం ప్రస్తుతం కార్పొరేట్ సెక్టార్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఒక్కసారిగా సెలవు పెట్టి విధులకు దూరమయ్యారు. ఇంకా చెప్పాలంటే... ఆయన పని చేస్తున్న కంపెనీ యాజమాన్యమే ఆయనను బలవంతపు సెలవుపై పంపేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారకంగా వెల్లడించింది. తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది సదరు సంస్థ. విశాల్ గార్గ్ స్థానంలో కెవిన్ ర్యాన్ పేరును తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని కూడా కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా
బెటర్ డాట్ కామ్ సంస్థకు ప్రస్తుతం ముఖ్య కార్య నిర్వహణాధికారిగా విశాల్ గార్గ్ వ్యవహరిస్తున్నారు. గార్గ్ వ్యవహారంపై కంపెనీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కొద్ది రోజుల కిందట జూమ్ కాల్ కాన్పరెన్స్‌లో ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎలాంటి కారణాలను చూపించకుండానే 900 మంది ఉద్యోగులను విశాల్ గార్గ్ తొలగించారు. దీనిపై ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూడే మూడు నిమిషాల్లోనే జూమ్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు విశాల్ గార్గ్. ఈ మీటింగ్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో విశాల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సంస్థ నిర్వాహకులు. బెటర్ డాట్ కామ్ సంస్థ యాజమాన్యంపై కూడా నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో... దిద్దుబాటు చర్యలు చేపట్టింది సంస్థ యాజమాన్యం. బోర్డ్ డైరెక్టర్స్‌కు తక్షణమే రిపోర్డు చేయాలని కూడా విశాల్‌ను ఆదేశించింది. కల్చరల్ అసెస్‌మెంట్ కోసం ఇండిపెండెంట్ థర్డ్ పార్టీని కూడా యాజమాన్యం నియమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: