పెట్రో ఒత్తిడి.. ఎలక్ట్రిక్ వాహనాల ఊపు కోసమేనా..!

Chandrasekhar Reddy
గతంలో మోడీ ప్రభుత్వం రాగానే నోట్ల రద్దుతో పెద్ద దుమారమే లేపింది. అయితే అప్పటికి అది పెద్ద సమస్యగా కనిపించినప్పటికీ, ప్రస్తుతం మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే నోట్ల రద్దుతో దాదాపుగా అందరు డిజిటల్ వైపుకు అడుగులు వేయడం ప్రారంభించారు. దీనితో భారత్ ఆ దిశగా అందరికంటే ముందు అడుగులో ఉంది. భారత్ డిజిటల్ లావాదేవీలు 100 కోట్లకు చేరితే అత్యంత  అభివృద్ధి చెందిన దేశాలలో కూడా అది 25 కోట్లకు మించకపోవడం అనే మంచి పరిణామం నోట్ల రద్దు వలన మాత్రమే వచ్చింది. ఇంత త్వరగా ఈ పరిణామ క్రమం దేశంలో రావడానికి ఆరోజు నిర్ణయం చాలా ఉపకరించింది, అప్పటికి అది ఒత్తిడిగా అనిపించినప్పటికీ, ప్రస్తుతం చాలా ఉపయుక్తంగానే ఉంది. అలాగే పెట్రో ధరల విషయంలో కూడా మోడీ సర్కార్ బాగా మొండిగా ముందడుగు వేసుకుంటూ పోతుంది.
ఈ రెండు అడుగులు వేయడం ద్వారా ఓట్ల పట్ల కాకుండా దేశం ముందడుగు వేయడం ముఖ్యం అనే విషయాన్ని బీజేపీ నిరూపించింది. ఓట్ల కోసమే అయితే నాడు నిర్ణయం కూడా లేకుండా పోయేది. ప్రపంచం ముందు భారత్ డిజిటల్ గా మరో శతాబ్దం లో కూడా ముందుకు వచ్చి ఉండేది కాదు. అలా దేశం ముందడుగు వేయడంలో మోడీ సర్కార్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే ధోరణిలో కేవలం కాలుష్యం నివారణకు విద్యుత్ వాహనాల వినియోగ ప్రోత్సహం కోసమే పెట్రోల్ ధరలు తీవ్రంగా పెంచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికి ఇది భారంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో దేశంపై మంచి ప్రభావం ఉంటుందనేది వాళ్ళ అభిప్రాయం.
ఈ తరహా మొండి నిర్ణయాలు తీసుకోవడం కూడా భారత్ ను ప్రపంచం ముందు తలెత్తుకు నిలబెట్టడానికి పనికి వస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఇది కూడా విజయవంతం అయితే దేశంలో విద్యుత్ వాహనాలు విపరీతంగా పెరిగిపోతే కాలుష్య భారం చాలా తగ్గుతుంది. ప్రస్తుతం దేశ రాజధాని పరిస్థితి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆ స్థితి మరో నగరానికి రాకుండా చూసుకోవడం అందరి బాధ్యత, ఆ బాధ్యత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అందరిని దానిని కట్టుబడి ఉండేట్టు చేస్తుంది. అందుకే పెట్రో వత్తిడి కాలుష్యాన్ని తగ్గించేందుకు చేస్తున్న భారీ ప్రయత్నంగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: