దీపావళి : చైనాకు.. 50వేలకోట్ల నష్టాలు..!

Chandrasekhar Reddy
చైనా భారత సరిహద్దులలో చేస్తున్న కవ్వింపు చర్యలతో మరోసారి నష్టపోవాల్సి వచ్చింది. భారతదేశం నుండి అనేక మంది వ్యాపారాలు చైనా వస్తువులను కొని దేశంలో అమ్ముకుంటూ ఉండేవారు. దీని విలువ భారీగానే ఉంటుంది. కానీ తాజాగా నెల కొన్న పరిస్థితులతో మరోసారి చైనా వస్తువులను పూర్తిగా నిషేదించాలని స్వయానా భారత పౌరులే ముందుకు వచ్చి నిరసనలు లేవనెత్తడంతో ఈ సారి కూడా నష్టం తప్పట్లేదు ఆ దేశానికి. అసలే పండుగ సీజన్ కావడంతో ప్రతిసారి దానినుండి దిగుమతి చేసుకునే వస్తువులు ఈసారి రాకపోవచ్చు. ఈ విలువ దాదాపుగా 50000కోట్ల వరకు ఉంటుంది అని అంచనా వేస్తున్నారు.
అయితే గతంలోనే దీనికి మార్గాలు వేసినా అవి ఇప్పటికి ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికే గత లఢక్ ఘటనతో భారత్ లో చైనా యాప్ లన్ని నిషేదించిన విషయం తెలిసిందే. అలాగే ఈసారి కూడా ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో వాణిజ్య విషయంలో కూడా చైనాకు పూర్తిగా స్వస్తి పలకడానికి భారత్ సిద్ధమైందని అర్ధం అవుతుంది. ఈ ప్రభుత్వ నిర్ణయంతో భారత వ్యాపారాలు, దిగుమతి చేసుకునే వారు కూడా ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు దూరంగా ఉన్నారు. ఈ ఘర్షణలు లేకుంటే చైనా నుండి దీపావళికి కావాల్సిన సరుకులు, బాణాసంచా, ఇతర వస్తువులు కూడా దిగుమతి చేసుకోవడం జరిగేది. ఈ సారి మాత్రం వ్యాపారస్తులు ఇంతవరకు చైనా కు దిగుమతి కోసం అర్జీలు కూడా పెట్టకపోవడం పై భారతీయులు జాతీయంగా ఐక్యంగా ఆలోచిస్తున్నారని అర్ధం అవుతుంది.  
ఈ మేరకు గతంలో చైనా నుండి దిగుమతి చేసుకునే దేశంలోని 20 నగరాలలో పరిశీలించగా ఏ ఒక్క వ్యాపారి కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. అంటే ఎవరు కూడా చైనా ఉత్పత్తులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు అని తేలిపోయింది. న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, నాగపూర్, జైపూర్, లక్నో, చంఢీగర్, రాయపూర్, భువనేశ్వర్, కలకత్తా, రాంచీ, గౌహతి, పాట్నా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, మదురై, పుదుచ్చేరి, భోపాల్, జమ్ములలో ఈ దిగుమతులు ఎక్కువగా జరిగేవి. ఈ ఏడాది మాత్రం చైనా నుండి ఒక్క వస్తువు కూడా పండగకు దిగుమతి అయ్యే పరిస్థితి లేదు. ఏదో అంచనా కొద్దీ 50వేలకోట్లు అంటున్నారు కానీ దాదాపుగా రెండు లక్షల కోట్లపైనే ఈ వ్యాపారం ఉంటుంది. అంటే అదంతా చైనాకు నష్టమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: