పెట్టుబడులకు .. ఈటిఎఫ్ లు మేలు ..

Chandrasekhar Reddy
భారతదేశంలో పెట్టుబడులు అనగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది ఇంకా రియల్ ఎస్టేట్ మాత్రమే. అనంతరం మహిళల ప్రాధాన్యత మాత్రం బంగారం పైనే. ఇంకొందరు మాత్రం జీవితాభిమా లాంటి బాట పడుతున్నారు. కొందరు మాత్రం బ్యాంకులలో డిఫాజిట్స్ ను నమ్ముకుంటున్నారు.  ఇటీవల చాలా కొద్దిమంది అంటే బ్యాంకు స్కాం లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ల బాట పడుతున్నారు. దేశంలో పెట్టుబడులు అంటే ఎవరి మనసులో అయినా ఇంతకంటే ముందుకు పోవడం లేదు. కానీ ఇటీవలే ప్రాచుర్యం పొందుతున్న మరో పెట్టుబడి మార్గం కూడా ఉంది. అదే షేర్ మార్కెట్.
ఈ మార్కెట్ ఎక్కువ ఒడిదుడుకులకు లోను అవుతుండటంతో తక్కువ ప్రతిఫలం ఉన్న పైన చెప్పిన పెట్టుబడులకు అధికులు మొగ్గుచూపుతున్నారు. కానీ ఈ మార్కెట్ లో కూడా ఒక పద్దతి ప్రకారంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టుకునే అనేక మార్గాలు ఉన్నాయి. ఇలా కొద్దికొద్దిగా పెట్టుబడి పెంచుకుంటూ ఆయా సబ్జెక్టులపై పరిజ్ఞానం పెంచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ షేర్ కొనుగోళ్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ షేర్ మార్కెట్ లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ (సిప్) పద్దతిలో అతి చిన్న మొత్తాల నుండి కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంటే ప్రతి నెల 100 రూపాయల నుండి కూడా ఈ పెట్టుబడి ప్రారంభించవచ్చు. కొన్నేళ్లు ఇలా పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మార్కెట్ ఒడిదుడుకులతో పని లేకుండా పైన చెప్పిన పెట్టుబడుల వలన వచ్చే ప్రతిఫలం కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.  
ఈ చిన్న పెట్టుబడులను అవసరం వచ్చినప్పుడు తీసుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ తరహా పెట్టుబడులను మార్కెట్ పరిభాషలో ఈక్విటీస్ అంటారు.  ఇంకా చెప్పాలి అంటే నిఫ్టీ బీస్, బ్యాంకు బీస్, గోల్డ్ బీస్ అని పిలుస్తారు. వీటి నిర్వహణ నిపుణులు చేస్తుంటారు కాబట్టి మనకు షేర్ మార్కెట్ గురించి ఎటువంటి జ్ఞానం లేకపోయినా మనదగ్గర ఉన్న చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టుకుంటూ పోతే కొన్నేళ్ళకు మంచి ఆదాయం చేతికి అందుతుంది. ఖచ్చితంగా అది ఇతర సాంప్రదాయ పెట్టుబడులు ఇచ్చే ఫలితం కంటే ఎక్కువగానే ఉంటుంది. అంటే అవన్నీ 4-5 శాతం ఫలితాన్ని ఇస్తే, ఇది 10-13శాతం వరకు ఫలితాన్ని ఇస్తుందనేది నిపుణుల అంచనా. ఇవన్నీ కనీస రాబడులు మాత్రమే. ఒకవేళ మార్కెట్ ఒడుదుడుకులు పెద్దగా లేని పక్షంలో ఈ విలువ ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం భారతదేశంలో 4శాతం మంది మాత్రమే ఈ షేర్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే 134కోట్లలో 7కోట్ల మంది మాత్రమే ఈ పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: