ఎన్.పి.ఎస్. వయసు .. మార్పు ..

Chandrasekhar Reddy
నేషనల్ పెన్షన్ సిస్టం(ఎన్.పి.ఎస్.) లో ఖాతా తెరిచేందుకు వయోపరిమితి పెంచింది కేంద్రం. తాజా మార్పుతో 65ఏళ్ళు పైబడిన వారందరు ఈ ఖాతాను తెరవవచ్చు. దీనిలో ఖాతా తెరవడంతో పన్ను రాయితీ మాత్రమే కాకుండా పెన్షన్ అనుబంధ నిధి కూడా ఏర్పాటు అవుతుంది. తాజా వయోపరిమితి ప్రకారం 70 ఏళ్ళ వరకు ఈ ఖాతాలను తెరవవచ్చు. తాజా నిబంధనల ప్రకారం భారతీయ పౌరులు, నాన్ రెసిడెంట్, ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ ఖాతాను తెరవొచ్చు. వీళ్లు 75 ఏళ్ళ వరకు తమ ఖాతాలను కొనసాగించ వచ్చు.
అంటే ప్రస్తుత సడలింపు ప్రకారం 18-70 ఏళ్ళ వరకు ఎన్.పి.ఎస్.లో ఖాతాను తెరవవచ్చు. దీనికి ముందు వయోపరిమితి దాటిందని ఖాతాను మూసేసిన వారు తిరిగి తెరిచుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఈ కొత్త నిబంధనలతో సీనియర్ సిటిజెన్ లు ఖాతాలు తెరవడంతో పాటుగా పదవి విరమణ అనంతరం పొదుపు చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి పెట్టుబడుల తో వీరు జీవిత కాలానికి పెన్షన్ ప్రణాళిక చేసుకోవచ్చు. ఈ ఖాతాలకు పన్ను మినహాయింపు ఉండటం వీరికి అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది. వీటి ద్వారా ఈక్విటీ లలో పెట్టుబడులు క్రమబద్ధంగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఖాతాలలో సొమ్మును ఈక్విటీలలో 15-50 శాతం వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు.
ఇక ఈ ఖాతాలు నిలువరించుకోవడానికి ప్రస్తుత నిబంధనల ప్రకారం మూడేళ్లకు చేసుకోవాల్సి ఉంది. ఉదాహరణకు ఎవరైనా 65 ఏళ్ళు దాటిన వారు ఈ ఖాతాలు తెరిస్తే కనీసం మూడేళ్లు ఈ నిధులను తీయకుండా ఉండాలి. ఒకవేళ అత్యవసరంగా తీసుకోవాల్సి వస్తే, పన్ను రాయితీ తగ్గిస్తారు. అది కూడా 60 శాతం ఇస్తారు, మిగిలింది పెన్షన్ ప్రణాళిక కింద ఖాతాలో నిల్వ ఉంచాల్సి ఉంది. ఒకవేళ మూడేళ్లకు ముందే నిల్వలు తీసుకోవాల్సి వస్తే 20 శాతం పన్నురాయితీ లేకుండా ఇస్తారు, మిగిలింది పెన్షన్ కింద ఖాతాలో ఉండాలి. పన్ను రాయితీలు 80 సీసీడీ 1 మరియు 1బి కింద లక్షన్నర మరియు యాభైవేలు పన్ను ప్రయోజనాలు చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: