లక్ష్య సాధన దిశగా

లక్ష్య సాధన దిశగా
సముద్ర యానం ద్వారా జరిపితే ఎగుమతుల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ప్రథమ స్థానం గుజరాత్ ది. అధికారిక గణాంగాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ఎగుమతులు 159 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎం.ఎం.టి). అదే గుజారాత్ నుంచి జరిగిన ఎగుమతులు ఆంధ్ర ప్రదేశ్ కన్నా రెండింతలు పైచీలుకేఉంది. ఆ రాష్ట్ర అధికారులు 412 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసినట్లు చెబుతున్నారు.  ఈ గణాంకాలను పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎగుమతులను పెంచాలని, ప్రథమ స్థానం చేరుకునేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను అదేశించారు.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.  విజయవాడలో రెండు రోజుల పాటు  ఎగుమతులే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవ్ ను విర్వహిస్తోంది. ఇందులో  ఆంద్ర ప్రదేశ్ లో ని పోర్టులు వాటిల్లో కల్పిస్తున్న సదుపాయాలు, ఇతర అంశాలను వివరించనూన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు ఒడ రేవుల ద్వారా ఈ ఏడాది ఇంచుమించు 17 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు అధికారులు ప్రకటించారు.  ఆంధ్ర ప్రదేశ్ లో ఎగుమతులకు ఉన్న అవకాశాలు, లాజిస్టిక్స్ రంగంలో  వెసులు బాటును ఈ సందస్సు లో  వివరించ నున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రల నుంచి పలువురు పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, ఎగుమతి దారులు, వ్యాపార రంగంలో విశేష అనుభవం ఉన్నవారిని ఈ కార్యక్రమానికి పిలిచారు.
సామర్ద్యం ఉన్నా సరుకేది ?
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నాలుగు ఓడ రేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నాయి. మరో నాలుగు ఓడ రేవులు ఎగుమతులకు సిద్ధమవుతున్నయి. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనంత విస్తారమైన తీరప్రాంతం కేవలం ఆంధ్ర ప్రదేశ్ కు  సహజ సిద్ధమైన వరం. కాగా సరుకుల రవాణాలోనే  రాష్ట్రం నత్తనడక నడుస్తోంది. ఏ.పి నుంచి 253 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ఎగుమతలు చేయవచ్చని,   త్వరలో అందుబాటులోకి రానున్న నాలుగు పోర్టుల ద్వారా ఈ  సామర్ద్యం పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దేశంలోని ఇతర పోర్టులతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో ఎగుమతుల వ్యయం తక్కువని కూడా వారు పేర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మండలి నిర్వహించ నున్న వాణిజ్య ఉత్సవం ఏ మేరకు సఫలమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: