ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఎయిర్టెల్ ఆఫ‌ర్‌..!

Paloji Vinay
ఐపీఎల్ సెకండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో భార‌తీ ఎయిర్టెల్ ఐపీఎల్ ప్రియుల‌కు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. ఐపీఎల్ 2021 సెప్టెంబ‌ర్ 19న పునః ప్రారంభం కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భార‌తీయ ఎయిర్టెల్ డిస్నీ+, హాట్ స్టార్ స‌బ్ స్క్రిప్ష‌న్ల‌ను అందించే మూడు కొత్త రీచార్జ్ ప్యాకేజీల‌ను ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం విడుద‌ల చేసింది. దీంతో ఎయిర్టెల్ క‌స్ట‌మ‌ర్స్ తమ మొబైల్లోనే లైవ్ చూసేందుకు అవ‌కాశం ఉంది. ఈ మూడు కొత్త ప్యాక్(రూ.499, రూ.699, రూ.2798)లను రీఛార్జ్ చేసుకుంటే హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలు వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు.
ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్
    రూ.499 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను ఎయిర్టెల్ త‌మ క‌స్ట‌మ‌ర్స్ కు అందిస్తోంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ లో ఉచితంగా  వీడియోలను చూడొచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ లతో పాటు ఇత‌ర స‌దుపాయాలు కూడా పొంద‌వ‌చ్చు.
ఎయిర్‌టెల్ రూ.699 ప్లాన్
  రూ.699 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల గ‌డువుతో.. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా చూడొచ్చు. అలాగే రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇత‌ర స‌దుపాయాలు అద‌నం.

ఎయిర్ టెల్ రూ.2798 ప్లాన్
రూ.2798 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల గ‌డువుతో రోజుకు 2 జీబీ హైస్పీడ్ ఇంట‌ర్ నెట్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను త‌మ క‌స్ట‌మ‌ర్స్‌కు అందిస్తోంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ లో ఉచితంగా వీడియోలను వీక్షించొచ్చు.  ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ లు ఇత‌ర స‌దుపాయాలు కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: