విప్లవాత్మక మార్పులుంటాయి : మిట్టల్


విప్లవాత్మక మార్పులుంటాయి  : మిట్టల్
టెలికాం రంగంలో ఇక నుంచి విప్లవాత్మక మార్పులుంటాయని భారతీ ఎయిర్ టెల్  ఛైర్మెన్ సునీల్ మిట్టల్ పేర్కోన్నారు. కేంద్ర మంచి నిర్ణయం తీసుకున్నదని ఆయన  కితాబిచ్చారు.  మిట్టల్ తన సంతోషాన్ని వెలిబుచ్చడానికి బలమైన కారణం ఉంది.
కేంద్ర మంత్రి మండలి మరో మారు భారీ సంస్కరణలకు ఆమోదం తెలిపింది. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి  టెలికాం రంగంలో  పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.  టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణోవ్ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వివరించారు.
టెలికాం రంగంలో ఇప్పటి వరకూ  49 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇక నుంచి వంద శాతానికికి పెంచింది. ఈ చర్య మూలంగా పలు విదేశీ కంపెనీలు భారత్ టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టెందుకు అవకాశం ఏర్పడింది.
 ఈనాటి వరకూ టెలికాం రంగానికి ఇబ్బంది కరంగా ఉన్న ఏ.జి.ఆర్ ను హేతుబద్దీకరించింది. అందులోని నియమావళిని సరళీకరించింది. అంతేకాకుండా టెలికాం సంస్థలకు  పొందే టెలికాం యేతర ఆదాయన్ని ఏ .జి.ఆర్ నుంచి మినహాయించింది.  
టెలికాం రంగం చెల్లించాల్సిన చట్టబద్ద బకాయిల పై నాలుగేళ్లుగా  ఉన్న మారిటోరియం లోను మార్పులు తీసుకువచ్చింది. దీని ఫలితంగా నిధులు ఎక్కువ వెల్లువెత్తే అవకాశం ఉంది.
స్పెక్ట్రమ్ వినియోగపు చార్జీలను సరళీకృతం చేసింది. అంతేకాకుండా స్పెక్ట్రమ్ లెసెన్సు ఫీజులు,  వినియోగపు చార్జీలు చెల్లింపులో  జాప్యం జరిగితే పెనాల్టీ విధించేవారు. తాజాగా ఈ పెనాల్టీలను పూర్తిగా రద్దు చేసింది.
స్పెక్ట్రమ్ వేలం కు క్యాలండర్ ను విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి  ఏడాది అంటే, ఆర్థిక సంవత్సరం చివరి నెలలో స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తారు.
స్పెక్ట్రమ్ లో భాగస్వామ్యానికి అనుమతులిచ్చారు. ఫలితంగా టెలికాం ఆపరేటర్ తనకు అనుకూలంగా,  లాభం ఉన్న చోట భాగస్వామ్యం పొందే అవకాశం ఉంటుంది.
1953 నాటి కస్టమ్స్ చట్టంలో మార్పులు చేసింది. ఫలితంగా  టెలికాం సంస్థలు విదేశాల నుంచి తమకు అవసరమైన వస్తువులు ఎలాంటి అనుమతులు లేకుండా దిగుమతి చేసుకునే అవకాశం కలుగుతుంది.
   ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళ బిర్లా తదితరులు కేంద్ర మంత్రి మండలి నిర్ణయాన్ని స్వాగతించారు.  ప్రతిపక్షాలు మాత్రం టెలికాం సంస్కరణల పై మిశ్రమంగా స్పందించాయి. భారతీయ జనతా పార్టీ నిర్ణయాల వల్ల సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరదని కాంగ్రెస్ విమర్శించింది. సంస్కరణ పై ప్రస్తుతానికి ఏమీ వ్యాఖ్యానించేేది లేదని, కాల గమనంలో  వాటి ఫలితాలు చూసి స్పందిస్తామని మరి కొందరు పార్లమెంటు సభ్యులు తెలిపారు.
 
వరుస సమావేశాలు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: