భారీగా పెరిగిన అంబాని సంప‌ద‌.!

Paloji Vinay
     భార‌త‌దేశంలో అత్యంద సంప‌ద ఉన్న వ్య‌క్తిగా ముఖేష్ అంబాని ఉన్నారు. కుబేరుడిగా పొరుపొందిన  అంబానీ ఆసియాలోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో ఒక‌రు. జియోతో దేశంలో ఇంట‌ర్‌నెట్ విప్ల‌వం తీసుకువ‌చ్చారు అంబాని. ఆయన సంప‌ద మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల బ‌డ్జెట్ కంటే ఎక్కువ‌గా ఉంటుంది. ఒక్క రోజులోనే (సెప్టెంబ‌ర్ 3)న ముఖేష్ అంబానీ సంప‌ద 3.71 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగింది. ఈ సంప‌ద ఇంత భారీగా పెర‌గ‌డానికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ షేర్ల ధ‌ర కార‌ణంగా క‌నిపిస్తోంది.


 కంపెనీ షేర్ల విలువ ఇటీవ‌ల పెర‌గ‌డంతో 100 బిలియ‌న్ డాల‌ర్ల‌కు మించి నిక‌ర విలువ‌తో బిలియ‌నీర్ల ప్ర‌త్యేక క్ల‌బ్‌లోకి చేరుకోవ‌డానికి స‌మీపంలో ఉన్నాడు అంబాని. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 92.6 బిలియన్ డాలర్ల అంబానీ తన నికర ఆస్తుల విలువ చేరుకుంది. ప్రపంచంలో ఉన్న‌ అత్యంత ధనవంతుల జాబితాలో  12వ స్థానంలో కొన‌సాగుతున్నాడు ముఖేష్ అంబానీ.

 రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ షేర్లు సోమవారం (సెప్టెంబర్ 6) బీఎస్ఈలో 1.70 శాతం పెరిగి రూ.2,429.00 వద్ద నిలిచాయి. గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది  రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు వెల్ల‌డించింది.

లోకల్ సెర్చ్‌ ఇంజిన్‌ జస్ట్‌ డయల్‌లో 40.95% వాటాలు కొనుగోలు చేసిన‌ట్టు రిలయన్స్ రిటైల్ కంపెనీ ప్ర‌క‌టించింది. ఇక జియో ఇన్ఫోకామ్ అతి తక్కువ రేట్లకు ఇంటర్నెట్ అందిస్తూ ప్రత్యర్ధులకు కొర‌క‌రాని కొయ్య‌గా మారి టెలికామ్ రంగంలో స‌వాలుగా నిలిచింది. ప్రస్తుతం జియో భారతదేశంలో అతిపెద్ద వైర్ లెస్ సర్వీస్ ప్రొవైడర్ గా నిలిచింది.  2021, జూన్ చివరి నాటికి 43.66 కోట్ల మంది చందాదారులను కలిగి ఉన్న అతి పెద్ద టెలికామ్ రంగం కంపెనీగా నిలిచింది జియో.

  అలాగే, రిల‌య‌న్స్ నుంచి అతి త‌క్కువ ధ‌ర‌కే 5 జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే అనేక రంగాల్లో ముఖేష్ అంబాని అండ్ కో తిరుగులేని శ‌క్తిగా మారారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: