కార్లకు కూడా .. పండగ డిస్కౌంట్స్ .. భారీగానే..

Chandrasekhar Reddy
భారత్ లో భారీ జనాభా ఉండటంతో ప్రపంచమే దానిని పెద్ద మార్కెట్ గా గుర్తించింది. దీనితో ఎన్నో సంస్థలు తమ వస్తువులను భారత్ లో అమ్మెందుకు అనేక మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు, అమ్ముతున్నారు కూడా. ఇంత పెద్ద మార్కెట్ ఉండటంతో ప్రజలను ఆకర్షించడానికి అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ కూడా ప్రకటించడం ఆయా సంస్థలకు ఆనవాయితీగా మారిపోయింది. దీనితో పండుగలకు ఇక్కడ వ్యాపారం కోట్లలో ఉంటుందంటే ఆశ్చర్యం ఏమి కాదు. పెద్ద పెద్ద వస్తువుల నుండి చిన్న చిన్న వస్తువుల వరకు ఈ సంస్థలు డిస్కౌంట్స్ ప్రకటించడంతో ఈ మార్కెట్ సాధ్యం అవుతుంది. దీనితో వినియోగదారుడి నాడి కనుక్కొన్న ఆయా సంస్థలు ప్రతి పండగకు డిస్కౌంట్స్ ఇవ్వడం ప్రారంభించారు.
ఈ డిస్కౌంట్ మేళ ఎక్కడ వరకు పోయిందంటే, చిన్న కర్చీఫ్ కొన్నా డిస్కౌంట్, పెద్ద పడవంత కారు కొన్నా డిస్కౌంట్. ఇక్కడ డిస్కౌంట్ అనేది ఆకర్షణ తప్ప, సంస్థలకు పోయేది ఏమి ఉండదు, ఎటొచ్చి వినియోగదారుల జేబుకు చిల్లు. కొనాలి అనుకున్న దానికంటే ఎక్కువ కొనేస్తే చిల్లు గాక మరేమి ఉంటుంది చెప్పండి. ఇది పండగల సీజన్, అంటే వ్యాపార భాషలో డిస్కౌంట్స్ సీజన్ అన్నమాట. సాధారణ పరిస్థితులలో ఈ సీజన్ లో వ్యాపారం విపరీతంగా జరిగేది. అయితే ఇప్పుడు కరోనా తో పోరాటం చేస్తూ, జీవితం సాగించాల్సి వస్తుంది కాబట్టి అనుకున్నంత వ్యాపారం జరగకపోయినా సంస్థలు మాత్రం వారివారి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే డిస్కౌంట్స్ ప్రకటిస్తూనే ఉన్నారు. కరోనా కారణంగా నష్టపోయిన వ్యాపారాన్ని మళ్ళీ యాధస్థితికి తెచ్చుకునేందుకు వారి ప్రయత్నం.
తాజాగా పండుగ సందర్భంగా, హోండా తన కార్లపై భారీగానే డిస్కౌంట్స్ ప్రకటించింది. కొన్ని కార్లపై గరిష్టంగా 57,000 రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. హోండా అమేజ్, జాజ్, ఆల్ న్యూ సిటీ సెడాన్, డబ్ల్యు ఆర్ వి మోడల్ కార్లపై ఈ డిస్కౌంట్స్ ప్రకటించింది సంస్థ. ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని తెలిపింది.
హోండా అమేజ్ పై గరిష్టంగా 57,044 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తుంది సంస్థ. అమేజ్ ఫెస్టివల్ మోడల్ పై 18,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
హోండా జాజ్ పై 39,947 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంది.
హోండా డబ్ల్యు ఆర్ వి మోడల్ కార్లపై 39,998 రూపాయల డిస్కౌంట్ ప్రకటించారు.
హోండా సెడాన్ పై 37,708 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించారు. అయితే ఈ డిస్కౌంట్స్ లో ఎక్స్చేంజి బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: