వారి కోసం ఈ బ్యాంకు అదిరిపోయే రిటర్న్స్..?

Suma Kallamadi
చాలా మంది రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏ రకంగా డబ్బును దాచాలో తెలియక, ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. సరైన క్రమంలో డబ్బులు దాచి ఉంచినట్లైతే రిటైర్ అయ్యిన తర్వాత ఎంతో హాయిగా జీవితాన్ని గడపొచ్చు. రిటైర్ అయితే ఎటువంటి రిస్కులు ఉంటాయి, ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, ఎలా వాటిని అధిగమించాలనే దానిపై ఒక ప్రణాళిక అనేది అవసరం. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటీ ఆర్థిక సమస్యలూ రాకుండా ఉండేందుకు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమో లేకుంటే ఏదైనా స్కీమ్ లో డిపాజిట్ చేయడం వంటివి చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల వారికి ఆర్థిక భరోసా అనేది కలుగుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్‌ చేస్తే అది అధిక పెట్టుబడిని ఇస్తుంది. అంతేకాకుండా అది ఎంతో సురక్షింగా కూడా ఉంటుంది. వరల్డ్ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్ల కోసం మంచి బెనిఫిట్స్ ఇచ్చే ప్రకటన చేసింది.
వరల్డ్ సీనియర్ సిటిజన్ దినోత్సవం రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు అదనపు వడ్డీ రేట్లను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రిటైర్ అయ్యిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లు గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు అకౌంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డీ స్కీం ద్వారా సీనియర్ సిటిజన్లు 6.30 శాతం వడ్డీని పొందొచ్చు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకూ వారు రూ.2 కోట్ల లోపు ఎఫ్డీ చేయొచ్చు. దీనిపై బ్యాంకు ఇచ్చే వడ్డీని పొందొచ్చు. మామూలుగా ఉండే ఫిక్స్డ్ డిపాజిటర్ల కన్నా సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు అనేది 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగానే ఉండటంతో ఇది సీనియర్ సిటిజన్లు ఎంతో అద్బుతమైన అవకాశం. 65 సంవత్సరాలపైన ఉన్నవారు వారి యొక్క టర్మ్ డిపాజిట్లపైన 0.30 శాతం అదనంగా వడ్డీరేటును పొందే అవకాశం ఉంది. అలాగే ఎఫ్డీ పై వారు రుణాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రిన్సిపుల్ అమౌంటుపైన 90 శాతం వరకూ కూడా వారు లోన్ తీసుకునే సదుపాయం ఉంది. అంతేకాదు దీనిపై వారు క్రెడిట్ కార్డు కూడా తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: