రోబోల నుండి వెంటిలేటర్ల వరకు `నొక్కా రోబోటిక్స్`.!

Paloji Vinay
ప్రారంభ‌, త‌యారీ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌పై కొవిడ్ 19 ప్ర‌భావం ఎంత‌గానో ప‌డింది. ఒక వైపు మ‌హ‌మ్మారి కార‌ణంగా అనేక ప‌రిశ్ర‌మ‌లు, కొన్ని రంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అయితే వేగవంతమైన డిజిటలైజేషన్ కారణంగా హెల్త్‌టెక్, ఎడ్‌టెక్ మరియు హైపర్‌లోకల్ డెలివరీ వంటి కొన్ని రంగాలు ఊపందుకున్నాయి. మరికొన్ని మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న‌ పోరాటంలో మనుగడ సాగించడానికి సహాయపడతాయి. అందులో భాగంగానే ఎన్నో స్టార్ట‌ప్ కంపెనీలు భార‌త ప్ర‌జ‌ల‌కు వెన్నుద‌న్నుగా నిలిచేందుకు త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప‌దును పెట్టారు.
పూణేకి చెందిన నోక్కార్క్‌లో కూడా ఇదే కథ. 2017 లో ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులైన హర్షిత్ రాథోడ్, నిఖిల్ కురెలే నొక్కా రోబోటిక్స్ గా స్థాపించిన ఈ స్టార్టప్ సోలార్ ప్యానెల్ క్లీనింగ్ రోబోల తయారీదారుగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏదేమైనా, గత సంవత్సరం, మహమ్మారి ప్రబలినప్పుడు కొవిడ్ కి వ్యతిరేకంగా పోరాటంలో దేశానికి మద్దతుగా వెంటిలేటర్లను నిర్మించడంపై ఇది దృష్టి పెట్టింది.

హర్షిత్ రాథోడ్, నిఖిల్ కురెలే మొదట రక్షణ కోసం రోబోట్‌లను నిర్మించాలని ప్లాన్ చేసినప్పటికీ అది పట్టాలెక్కలేదు. తరువాత, వారు సౌర ఫలకాలను శుభ్రం చేయడానికి రోబోలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు."సౌర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది అలాగే భ‌విష్య‌త్తు కూడా ఉంది. కాబట్టి, మేము మా మొట్టమొదటి ఉత్పత్తిని అభివృద్ధి చేశాం. ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్ ఫండ్ నుండి రూ .12.4 కోట్లు సేకరించాం. కొవిడ్ - 19 వ‌చ్చిన‌పుడు మేము మా రెండవ ఉత్పత్తిపై పని చేస్తున్నాం.


లాక్‌డౌన్‌ల కారణంగా మేము మా కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.  మా వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో సంక్షోభంతో పోరాడటానికి ఎలా సహాయపడగలమో ఆలోచించడం ప్రారంభించాము, "అని వారు చెప్పారు.కొవిడ్ కార‌ణంగా వైద్య పరికరాల కోసం పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి, తీవ్రమైన అవసరం ఉందని గ్రహించిన స్టార్టప్ 90 రోజుల్లోపు వెంటిలేటర్లను వాణిజ్యపరంగా ప్రారంభించింది.
ప్రస్తుతం, ఇది దాదాపు 150 మంది బృందాన్ని కలిగి ఉంది, త్వరలో 200 మందితో కంపెనీనీ విస్తరించాలని చూస్తోంది. ఈ న్యూఢిల్లీకి చెందిన రైడ్-హెయిలింగ్ స్టార్టప్ ప్రజా రవాణా కోసం ఎల‌క్ట్రానిక్ వెహికిల్‌ స్వీకరణను ప్రోత్సహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: