అన్ని ర‌కాల వ్యాపారస్థుల‌ను "మ‌హ‌తి" ఒక్క చోట చేర్చింది : శ్రీనివాస్ గుప్తా

మ‌హ‌తి నెట్ వ‌ర్కింగ్ మార‌థాన్ కార్య‌క్ర‌మానికి తెలంగాణ టూరిజం చైర్మెన్ ఉప్పుట్ల శ్రీనివాస్ గుప్తా హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ..నెట్ వ‌ర్కింగ్ మార‌థాన్ అనేది ఓ మంచి కార్య‌క్ర‌మం అని అన్నారు. ర‌క‌ర‌కాల వ్యాపారాలు చేసేవారు ఈ కార్య‌క్ర‌మం ద్యారా ఒక్క చోట చేర్చార‌ని అన్నారు. బిజినెస్ అనేది ఎలా చేయాలి..ఎలా చేస్తే లాభాలు ఉంటాయో చెప్పడానికి ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయమ‌ని అన్నారు. క‌రోనా పాండ‌మిక్ కార‌ణంగా వ్యాపారంలో రెండేళ్లుగా అంతా వెన‌కబ‌డి పోయార‌ని అన్నారు. చిన్న పాన్ షాప్ నుండి పెద్ద వ్యాపార‌స్థుల వ‌ర‌కూ అంద‌రూ ఇబ్బందులు ఎదురుర్కొన్నార‌ని చెప్పారు. ఇక థ‌ర్డ్ వేవ్ రాకూడద‌ని తాను దేవుడిని కోరుకుంటున్నాన‌ని అన్నారు. త్వ‌ర‌లోనే వ్యాపారాలు బాగుంటాయ‌ని తాను కోరుకుంటున్నాని అన్నారు. 

తెలంగాణ ఏర్పడిన త‌ర‌వాత నా భూతో నా భ‌విష్య‌త్ లాగా తెలంగాణ‌లోని హైద‌రాబాద్ దేశానికి ఆద‌ర్శంగా మారింద‌ని అన్నారు. ఇంత‌కు మందు ప‌వ‌ర్ హాలిడే అని ప్ర‌తి మంగ‌ళ‌వారం లేదా బుధ‌వారం సెల‌వులు ఉండేవ‌ని అన్నారు.. కానీ ఇప్పుడు కేసీఆర్ నాయ‌క‌త్వంలో 24గంట‌ల క‌రెంట్ ఇస్తున్నార‌ని అన్నారు. ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌తో హైటెక్ సిటీ క‌ల‌క‌ల లాడుతుంద‌ని అన్నారు. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ , యాపిల్, ఫేస్ బుక్ లాంటి కంపెనీల‌ను తీసుకువ‌చ్చి బెంగుళూరు త‌ర‌వాత హైద‌రాబాద్ ఎదిగింద‌న్నారు. త్వ‌ర‌లోనే ఫార్మా ఇండ‌స్ట్రీని కేటీఆర్ అభివృద్ధి చేయ‌బోతున్నార‌ని అన్నారు. హైద‌రాబాద్ లో ఫ్యాక్ట‌రీల నిర్మాణానికి ఆహ్వానిస్తున్నామ‌ని అన్నారు.

బెంగుళూరు, ఢిల్లీ త‌ర‌వాత హైద‌రాబాద్ అంత‌టి మ‌హాన‌గ‌రం అవుతుంద‌ని అన్నారు.దుర్గం చెరువును ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చి దిద్దుతున్నామి వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో హ‌రిత హారం కార్య‌క్రమం ద్వారా చెట్ల పెంప‌కాన్ని పెంచింద‌ని అన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు సంధ‌ర్భంగా ముక్కోటి వృక్షార్చ‌న పేరుతో తాము మొక్క‌లు నాటామని అన్నారు. ఇండ‌స్ట్రీల‌లో ప‌నిచేసే వారు కూడా త‌లా మూడు నుండి ఆరు మొక్క‌ల‌ను నాటాల‌ని పిలుపునిచ్చారు. రాబోయే 20 సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఆక్సిజ‌న్ ప్లాంట్ గా తెలంగాణ మారుతుంద‌ని అన్నారు. తెలంగాణ‌లో బిజినెస్ టూరిజం ను కూడా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. మ‌హ‌తి అవినాశ్ ద్వారా కూడా తాము బిజినెస్ ను డెవ‌ల‌ప్ చేస్తామ‌ని చెప్పారు. అంద‌రితో క‌లిసి తెలంగాణ టూరిజం ను డెవ‌ల‌ప్ చేస్తామ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: