కొత్త‌గా బిజినెస్ లోకి అడుగుపెట్టేవాళ్లకు "మ‌హ‌తి" గోల్డెన్ ఛాన్స్.. !

కొత్తగా స్టార్ట్ అప్ ల‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారా.. ? వ్యాపార రంగంలో మీ సొంత కాళ్లపై మీరు ఎదగాలని ఆశపడుతున్నారు.. ?  మీకు బిజినెస్ లో ఎలాంటి అనుభవం లేదా.. ? అయితే అలాంటి వారి కోసమే మహతి మార్కెట్ ఎసెన్షియల్జ్ ఎల్ ఎల్ పీ అనే సంస్థ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ తో క‌లిసి గోల్డెన్ ఛాన్స్ ను తీసుకువ‌చ్చింది. కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న వారికోసం వ్యాపారంలో న‌ష్ట‌పోయిన‌వారికోసం బిజినెస్ మార‌థాన్ ను నిర్వ‌విస్తోంది. ఈ స‌మావేశంను ఆగస్టు 6 ,7వ‌ తేదీలలో 250 పైగా వ్యాపారవేత్తల తో హైదరాబాద్ లోని హోటల్ నోవెట‌ల్ లో  ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే వ్యాపారవేత్తలు కొత్తగా బిజినెస్ ను ప్రారంభించాల‌ని అనుకునే వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరు అవుతారు. 

చిన్న, మధ్య తరగతి వ్యాపారాలను ప్రారంభించే వారి కోసమే ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులను ఒక దగ్గర చేర్చడానికి ఈ సమావేశం నిర్వహించబడుతుంది. దీని ద్వారా వివిధ రకాల వ్యాపారాలకు సంబంధించిన వారు ఒక చోట కలవడం వల్ల వారి బిజినెస్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మ‌హ‌తి మార్కెట్ ఎసెన్షియ‌ల్జ్ఎల్ ఎల్ పీ సంస్థ‌ నెట్ వ‌ర్క్ మార్కెటింగ్ విధానం తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సదస్సులో వస్తువులను తయారు చేసే కంపెనీలు.... సర్వీస్ ప్రొవైడర్లు కూడా హాజరవుతారు. అంతేకాకుండా వైద్య రంగానికి సంబంధించిన వారు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సైతం ఈ సదస్సులో పాల్గొంటారు. 
ఈ సమావేశాన్ని దాదాపు ఆరు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. ఇక ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలంగాణ టూరిజం చైర్మన్ హాజరుకానున్నారు. 

అంతేకాకుండా తెలంగాణ ఎం ఎస్ ఐ సి జోన‌ల్ హెడ్ శ్రీనివాసరావు కూడా హాజరవుతారు. స‌మావేశానికి బ‌ల్ద‌వా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అధినేత గోపాల్ బ‌ల్ద‌వా కూడా సమావేశంలో పాల్గొంటారు. ఇక ఈ సద‌స్సు గురించి అభిలాష్ ఖానాపూర్ మాట్లాడుతూ... మహతి మార్కెట్ ఎసెన్షియల్జ్ కంపెనీ ద్వారా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలల‌ని అనుకునేవారికి వ్యాపారంలో నష్టపోయిన వారికి నమ్మకాన్ని, ఆత్మస్థయిర్యాన్ని పెంచడానికి నెట్ వ‌ర్కింగ్ మార‌థాన్ ను నిర్వహిస్తున్నామని అన్నారు. వివిధ రకాల వ్యాపార సముదాయాలను ఒక చోట చేర్చ‌డం ద్వారా వ్యాపారస్తుల మధ్య సహకారం అభివృద్ధి చెంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యాపారస్తుల మధ్య స‌త్సంభందాలు ఏర్పడతాయని అన్నారు. ఇక ఈ సమావేశానికి హాజరవ్వాల‌ని అనుకునేవారు రూ. 3999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ డబ్బులను చెల్లించాలి. ఇక రెండు రోజులపాటు హోటల్ లో వసతి మరియు భోజనం ఉచితంగా లభించనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: