భారత్‌ బ్యాన్‌?.. చైనా కంపెనీ ఎంఐ షేర్‌ డామ్?

Chakravarthi Kalyan
ఎంఐ, షియోమీ, రెడ్‌ మీ.. ఇలా అనేక పేర్లతో పాపులర్ అయిన ఎంఐ సంస్థ షేర్లు ఇప్పుడు స్టాక్ మార్కెట్‌ లో కుదేలవుతున్నాయి. ఈ సంస్థ షేర్లు.. ఈ ఏడాది లోఇప్పటి వరకూ 35 శాతం వరకు క్షీణించింది. ఇందుకు కారణం.. రూ. 12 వేల లోపు స్మార్ట్‌ఫోన్ల విక్రయంపై భారత్‌లో నిషేధం విధించే అవకాశం ఉందన్న వార్తలే. ఈ వార్తల నేపథ్యంలో  షియామీ షేరు హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్‌లో నిన్న 3.6 శాతం వరకూ నష్టపోయింది.

ఒక్క షియామీ మాత్రమే కాదు.. ఒపో, వివో వంటి చైనా సంస్థలు కూడా కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఈ సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై అనుమానాలతో భారత  పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు..  వేల కోట్ల రూపాయలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సంస్థలు నగదును విదేశాలకు అక్రమంగా తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణాలతో ఇప్పుడు చైనా మొబైల్ ఫోన్ సంస్థలకు ఇండియాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: