ఆ పేరు చెబితేనే అమెరికా హడలిపోతోంది?

Chakravarthi Kalyan
అమెరికా.. ప్రపంచంలోనే అతి సంపన్నదేశం.. అన్ని విషయాల్లోనూ అమెరికా సూపర్ పవర్‌గా ఎదిగింది. కానీ ఇప్పుడు అదే అమెరికాను ఓ సమస్య భయపెడుతోంది. వణికిస్తోంది. హడలెత్తిస్తోంది. అదే.. ఆర్థిక మాంద్యం.. అమెరికాకు ఇప్పుడు గడ్డు రోజులు రాబోతున్నాయా అన్న భయం మొదలైంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోన్న వేళ ఆర్థిక మాంద్యం భయాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు ఊహించిన దాని కంటే తగ్గింది.  1.6శాతం పడిపోయింది. వరుసగా రెండో త్రైమాసికంలోనూ అమెరికా జీడీపీ తగ్గే అవకాశాలున్నాయి. జూన్‌ నెలలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల సరికొత్త గరిష్ఠానికి చేరుకుంది. అందుకే ఫెడరల్ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇవాళ  సమావేశం కానున్న ఫెడ్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీ రేట్ల పెంపు అత్యవసరమని ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పోవెల్ ఇప్పటికే చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: