ఉదయ్‌పూర్‌ హత్య వెనుక పాకిస్తాన్ కుట్ర?

Chakravarthi Kalyan
ఉదయ్‌పూర్‌ లో ఓ హిందూ టైలర్‌ను దారుణంగా చంపిన కేసులో నిందితుడికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఈ హత్య కేసులో అరెస్టయిన నిందితుడు రియాజ్ అఖ్తరీకి అనుమానిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. మొన్నటి ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ.. NIA బృందం.. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి ఉదయ్‌పూర్‌కు చేరుకుంది.
నిందితుడు రియాజ్ అక్తర్‌కు పాకిస్తాన్ సంస్థ 'దావత్-ఎ-ఇస్లామీ'తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోందన్న దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థ దేశంలో అనేక ఇతర ప్రాంతాలలో కూడా శాఖలను కలిగి ఉన్నట్లు తెలుస్తోందని ఎన్‌ఐఎ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్యతో సహా అనేక ఇతర ఉగ్రవాద సంఘటనలకు ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది సభ్యులని గుర్తించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: