అమరావతిలో జగన్ అమ్మే భూములు ఇవేనా?

Chakravarthi Kalyan
అమరావతి భూములను క్రమంగా అమ్మాలని జగన్ సర్కారు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా 15 ఎకరాలను ఈ వేలం ద్వారా అమ్మాలని జగన్ సర్కారు నిర్ణయించినట్టు ఈనెల 6న విడుదల చేసిన జీవో ద్వారా తెలుస్తోంది. అయితే.. ఈ వేలం విజయవంతం అయితే.. మరికొన్ని భూములు కూడా అమ్మాలని జగన్ సర్కారు ప్లాన్ రెడీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

మరి ఇంతకీ జగన్ సర్కారు అమ్మాలని భావిస్తున్న భూములు ఏవి.. ఏవంటే.. గతంలో బీఆర్‌ షెట్టి మెడిసిటీ కోసం ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. అవి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి. ఈ  100 ఎకరాలు ప్రభుత్వం అమ్మే ఆలోచనలో ఉందట. అలాగే  లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి
ప్రభుత్వం 148 ఎకరాల్ని కేటాయించింది. అవి కూడా ఖాళీగానే ఉన్నాయి. ముందుగా బీఆర్‌ షెట్టి మెడిసిటీ కి కేటాయించిన భూములు.. ఆ తర్వాత లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన భూములు అమ్మాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఇకపై సీఆర్‌డీఏ ఏటా 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల వరకూ అమ్మే ఆలోచనలో ఉన్నట్టు ప్రముఖ దిన పత్రిక పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: