చైనాకు సహకరిస్తున్నారని ఇండియా చుక్కలు చూపించింది?

Chakravarthi Kalyan
ఇండియా చైనా కంపెనీలను కొన్ని సంవత్సరాలుగా బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. గాల్వన్ యుద్ధం తర్వాత సాధ్యమైనంత వరకూ చైనా వస్తువుల వాడకాన్ని, చైనా కంపెనీలతో వాణిజ్యాన్ని తగ్గిస్తోంది. అయితే.. కొందరు ఇండియాలోనే ఉంటూ చైనాకు సహకరిస్తున్నారు. చైనా కంపెనీలు దొడ్డి దారిన ఇండియన్ మార్కెట్‌లో అడుగు పెడుతున్నాయి. ఇండియా అతి పెద్ద మార్కెట్ అన్న సంగతి తెలిసిందే. ఈ మార్కెట్‌ను వదులుకునేందుకు చైనా సిద్ధంగా లేదు.

అందుకే కొందరు ఇండియన్ల సాయంతో దొడ్డి దారిన ఇండియాలో కంపెనీలు ఏర్పాటు చేసుకుని వాణిజ్యం చేస్తోంది. ఇందుకు సహకరించిన దాదాపు 400మంది కంపెనీ సెక్రటరీలు, ఛార్టెడ్ అకౌంటెంట్లను ఇండియా గుర్తించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దిల్లీ శివార్లలోని నోయిడాలో చైనా దేశీయులు అనేక కంపెనీలు ఏర్పాటు చేశారు. అయితే.. అవి చైనా కంపెనీలు ఉన్న అనుమానం రాకుండా ఇండియన్లతో వాటిని నడిపిస్తున్నారు. ఇందుకు అనేక మంది చార్టెట్‌ ఎకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు చైనా సంస్థలకు సహకరించారు. ఇప్పుడు వారిపై చర్యలకు ఇండియా సిద్ధమైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: