రూ.34,615కోట్లు: ఇండియాలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ స్కామ్‌?

Chakravarthi Kalyan
బాబోయ్..ఇది అలాంటి ఇలాంటి స్కామ్ కాదు.. ఇండియాలోనే అతి పెద్ద బ్యాంకింగ్ స్కామ్.. అవును మరి ఏకంగా రూ.34,615కోట్లు స్కామ్ జరిగిందంటే మాటలా.. ఇంతకీ ఈ స్కామ్ ఎక్కడ ఏంటి అంటారా.. దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అంటే DHFL సంస్థ మాజీ ప్రమోటర్లు కపిల్‌ వాధ్వాన్‌, ధీరజ్‌ వాధ్వాన్‌ ఏకంగా బ్యాంకులను మోసం చేసి ఈస్కామ్ చేసినట్టు సీబీఐ తాజాగా కేసు దాఖలు చేసింది.
బ్యాంకులను మోసగించిన వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో... ఇప్పటి వరకూ ఇదే అతి పెద్దది కావడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ముంబయిలోని 12చోట్ల సోదాలు నిర్వహించారు.  ఆ తర్వాత DHFLతోపాటు ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు కపిల్‌, ధీరజ్‌ వాధ్వాన్‌, అమరిల్లీస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కేసు నమోదు చేశారు. 2010-2018 మధ్య 17 బ్యాంకుల కన్సార్టియం 42, 871 కోట్ల రుణాలు ఇచ్చింది. అయితే.. 2019 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: