ఇండియాకు షాక్‌: పాకిస్తాన్‌పై మళ్లీ చైనా ప్రేమ?

Chakravarthi Kalyan
ఉగ్రవాదుల స్వర్గంగా పేరున్న పాకిస్తాన్‌ కు అండగా నిలుస్తూ కయ్యాలమారి చైనా మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. పాకిస్తాన్  ప్రేరేపిత ఉగ్రవాదానికి చైనా అండగా నిలిచింది.  పాక్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ అగ్రనేత అబ్దుల్  రెహమాన్  మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో అడ్డు తగిలింది. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ , అమెరికా చేసిన ప్రతిపాదనకు చైనా ఐక్యరాజ్యసమితిలో అడ్డుతగిలింది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, చైనా ప్రతిపాదనను చైనా నిలిపేసింది. ఇంతకీ ఈ మక్కీ ఎవడంటే..  లష్కరే తోయిబా చీఫ్ , ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్  సయ్యీద్ కు వీడు బంధువు అవుతాడు. లష్కరే తోయిబా నాయకత్వంలో వివిధ హోదాల్లో ఈ మక్కీ పని చేసిన చరిత్ర ఉంది. వీడిని ఇప్పటికే అమెరికా ఉగ్రవాదిగా గుర్తించింది కూడా. అయితే.. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చివరి నిమిషంలో చైనా అడ్డుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: