బాబోయ్‌ విజయసాయి.. ఇంత ఘాటు పోస్టులా ?

Chakravarthi Kalyan
టీడీపీ అంటే తెలుగు దేశం పార్టీ.. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం దీనికి కొత్త అర్థం చెప్పుకొచ్చారు. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ అంటూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అంతే కాదు.. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారని.. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి వ‌రుసగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు.

పిచ్చి కుక్క కరిచిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపిస్తామని.... అదే టీడీపీలో అయితే చంద్రబాబు అనే పిచ్చి కుక్క కరిచిన వారిని అధికార ప్రతినిధులుగా పంపిస్తారని విజయసాయి రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు. ఇక, రేప్‌ చేస్తా అంటూ పేలుతున్న అశుద్ధం గంజాయి పాత్రుడి వంటి టీడీపి వెధవలను పశువుల హాస్పిటల్‌ ఆవరణలో ఉండే ఇనుప చట్రంలో కట్టేయాలన్నారు. పశువులకు ఇచ్చే ట్రీట్‌మెంటే ఇవ్వాలని అయ్యన్నపాత్రుడిని ఉద్దేశిస్తూ మరో పోస్టు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: