బాబోయ్‌.. ఈ నేరాలు బాగా పెరిగిపోతున్నాయ్‌..?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు జోరు పెంచేశారు. ప్రతినెలా వందల కొద్దీ ఈ  సైబర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. విదేశాల్లో సైబర్ క్రైమ్ కేసులను వదిలేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెబుతారని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇండియన్ పోలీస్ మాత్రం సైబర్ క్రైమ్ కేసులను వదిలిపెట్టరు. అభివృద్ధి చెందిన దేశాల్లో నిధులు- టెక్నాలజీ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
 ఇండియన్ పోలీస్ కు నిధులు తక్కువ, టెక్నాలజీ కూడా తక్కువే..  అయినా రాజీ పడకుండా ఇలాంటి సైబర్ నేరగాళ్లను పట్టుకుంటూనే ఉన్నారు. ఇక ముందు ముందు ప్రతి పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే... తెలంగాణలో రోజు వారీ కేసుల నమోదులో 20శాతం సైబర్ క్రైమ్ కేసులే నమోదవుతున్నాయి. అంటే ఇక ముందు ముందు పోలీసింగ్ రూపులేఖలు మారనున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: